భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలను తమ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తున్నాయి. హ్యుందాయ్ కంపెనీ సరికొత్త కారును ఆవిష్కరించింది. ఫ్లెక్స్ ఫ్యుయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా మోడల్ ను తీసుకువచ్చింది. హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారుతో ఎకో ఫ్రెండ్లీ జర్నీని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ హ్యూందాయ్ క్రెటా మోడల్ కారు 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.
ఇది 100 శాతం ఇథనాల్‌తో నడుస్తుంది. ఫ్లెక్స్ ఫ్యు్యల్ వేరియంట్ లో 1.0 లీటర్ GDI టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 118bhp పవర్ 172Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. క్రెటా ఫ్యుయల్ ఫ్లెక్స్ ప్రత్యేకంగా ఇథనాల్ తో నడిచేలా ట్యూన్ చేయబడింది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ తో ఉంటుంది. కాగా ఫ్లెక్స్ ఫ్యుయల్ టెక్నాలజీ వల్ల ప్రయెజనం ఏంటంటే ఈ కార్లు పర్యావరణ హితంగా ఉంటాయి. భారత్ లో క్రెటా లైనప్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్‌తో విభిన్న శ్రేణి పవర్‌ట్రైన్‌లను అందిస్తుంది.
హ్యుందాయ్ కంపెనీ తమ క్రెటా ఎలక్ట్రిక్ కారు ధరను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ వేరియంట్ Executive, Smart, Smart (O), Premium అనే వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.17.99 లక్షల నుంచి రూ.23.49 లక్షల మధ్య(ఎక్స్- షోరూమ్) ఉండనుంది. వేరియంట్లవారీగా ఈ ఈవీ ధరలను పరిశీలిస్తే ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధర రూ.17.99 లక్షలుగా ఉంది. ఇక స్మార్ట్ వేరియంట్ ధర రూ.18.99 లక్షలుగా, ప్రీమియం వేరియంట్ ధర రూ.19.99 లక్షలుగా ఉండనుంది. దీంట్లో స్మార్ట్(ఓ) వేరియంట్.. 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ.21,49,900 గా ఉండనుంది.
దీంట్లో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.23,49,900 గా ఉండనుంది. క్రెటా ఎలక్ట్రిక్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్ల శ్రేణిని కలిగి ఉంది. ఇది టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, EBDతో ABS, లెవెల్-2 ADAS, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్-సీట్ మౌంట్‌లు, భద్రత కోసం 360-డిగ్రీ కెమెరాతో ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లను కలిగి ఉంది.