భారత్ మొబిలిటి గ్లోబల్ ఎక్స్ పో కొనసాగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్ని తమ కొత్త మోడల్స్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. కార్లు, ఎలక్ట్రిక్ కార్లు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆటో ఎక్స్ పోలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త కార్లను ఆవిష్కరించింది. ఇందులో ఈవీ కారు కూడా ఉంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్ తో టాటా కార్లు అదరగొడుతున్నాయి. టాటా ఆవిష్కరించిన కార్లలో సియెర్రా, హారియర్ ఈవీ, టాటా అవిన్యా X కాన్సెప్ట్ ఉన్నాయి.
టాటా సియెర్రా:
ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్(ICE)తో ఉండే సియెర్రా ఎస్‌యూవీని టాటా మోటార్స్ ఈ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. వింటేజ్ డిజైన్ కు మోడర్న్ డిజైన్ టచ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వర్షన్ లో కూడా తీసుకురానున్నట్లు సమాచారం. ముందు భాగాన మెయిన్ హెడ్‌లైట్స్‌తో కనెక్టెడ్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) బంపర్‌లో అమర్చి ఉన్నాయి. వెనుకవైపు LED టెయిల్ ల్యాంప్స్ దీనికి స్లీక్ లుక్ అందిస్తున్నాయి.
దీన్ని 4, 5 సీట్ల కన్ఫిగరేషన్లలో ఎంచుకోవచ్చు. ఈ సియెర్రా కారు 12.3 అంగుళాల స్క్రీన్, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, హై- క్వాలిటీ సౌండ్ సిస్టం వంటి ప్రీమియం ఫీచర్లతో ఉంటుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. దాంతో పాటు 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటివి ఉంటాయి.
టాటా హారియర్ EV:
ఎలక్ట్రిక్ వర్షన్ లో టాటా హారియర్ EVని ఆవిష్కరించింది. టాటా హారియర్ EV లుక్స్ పరంగా ICE వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ కారుకు అనుగుణంగా దాని ముందు, వెనుక బంపర్‌లకు అవసరమైన మార్పులు చేశారు. దీనితో పాటు, టాటా హారియర్ EVలో కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ అందించారు. కొత్త టాటా హారియర్ EV 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
హారియర్ EVలో వెహికల్ టు లోడ్, వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ సామర్ధ్యం కూడా అందించబడింది. హారియర్ EV స్టీల్త్ ఎడిషన్‌లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డ్యూయల్-జోన్ AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ప్రయాణీకుల భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
టాటా అవిన్య కాన్సెప్ట్:
టాటా అవిన్య కాన్సెప్ట్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. 2022లో ప్రవేశపెట్టిన మోడల్‌తో పోలిస్తే ఇది రీడిజైన్ చేయబడింది. ఇది T- ఆకారపు LED DRL, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, సొగసైన LED హెడ్‌లైట్‌లను కలిగి ఉంది. కెమెరా-ఆధారిత బాహ్య రియర్‌వ్యూ మిర్రర్లు, టెయిల్‌లైట్‌లు కూడా LED DRLలతో T-ఆకారపు డిజైన్‌ను కలిగి ఉన్నాయి.
డ్యూయల్ 12.3-అంగుళాల డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, మల్టీ-జోన్ ఆటో AC వంటి ఫీచర్లు ఇందులో అందించారు. వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-వెహికల్ వంటి ఫీచర్లను కూడా ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలు (ADAS) వంటి ఫీచర్లను అందించారు.