భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కొత్త వాహనాలు కనిపించాయి. భారతీయ ఆటో కంపెనీ A-THON కూడా అశ్వ పేరుతో ఒక అద్భుతమైన కారును పరిచయం చేసింది. ఈ కారు రెండు వేరియంట్లలో వస్తుంది. A-THON Ashva – 4X4, A-THON Ashva 6X4. ఈ కార్లు వ్యవసాయం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆఫ్-రోడ్ డ్రైవింగ్ కోసం ఈ కారును ఉపయోగించవచ్చు. A-THON యొక్క ఈ కారు కొండ ప్రాంతాలలో మీకు ఎంతో సాయం చేస్తుంది. వ్యవసాయం, విపత్తు నిర్వహణ తదితరాల కోసం వీటిని సిద్ధం చేశారు. సామాన్య ప్రజలు కూడా ఈ వాహనాన్ని సులభంగా నడపగలరు. మెరుగైన రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు.
READ MORE: AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కీలక నిర్ణయం.. త్వరలోనే సంస్థ విస్తరణ..!
ఇది 4 స్ట్రోక్, V ట్విన్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. మెరుగైన పనితీరు కోసం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (CVT) అందించారు. ఇది టీ లేదా కాఫీ తోటలలో కూడా సులభంగా తిరుగుతుంది. నిటారుగా ఉన్న ప్రాంతాల్లో కూడా సుభంగా నడపవచ్చు. ముందు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. అంతే కాకుండా.. అల్లాయ్ వీల్స్ రైడ్‌ని సులభతరం చేస్తాయి. ఇది 2 సీటర్ వాహనం, ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. కంపెనీ అందులో కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తుంది. దీని ద్వారా అవసరాన్ని బట్టి మార్పులు చేసుకోవచ్చు. అవసరమైతే ఈ కారులో ట్రాక్టర్ వంటి ఉపకరణాలను అమర్చుకోవచ్చు. అశ్వ ధర దాదాపు రూ.22 లక్షల నుంచి మొదలవుతుంది. దీన్ని కొనుగోలు చేయడానికి, మరింత సమాచారం కోసం.. A-THON Altrian యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
READ MORE: Karnataka: “భారతమాత హిందువులకు మాత్రమే దేవత”.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కొత్త వివాదం..