Bharat Mobility Global Expo 2025 Hero MotoCorp: న్యూడిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆటో మొబైల్ ప్రపంచం పునరుద్ధరణకు దారితీసే అనేక కొత్త వాహనాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త టూ వీలర్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో Xoom 125, Xoom 160 స్కూటర్లతో పాటు Xtream 250R, Xpulse 210 బైకులను కూడా విడుదల చేసింది. వీటితో హీరో 2025 మార్కెట్‌లో తన స్థానం మరింత బలపరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఒక్కొక వాహనానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: PM Modi : ఫిబ్రవరిలో ప్రధాని మోదీ తొలి అంతర్జాతీయ పాడ్‌కాస్ట్ .. ఆయన ఎవరితో మాట్లాడతారంటే ?
హీరో తీసుకువచ్చిన Xoom 125 స్కూటర్ ధర రూ. 86,400 (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతోంది. ఈ స్కూటర్ VZ, ZX వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇక ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 125 సీసీ ఇంజిన్, 9.7 bhp పవర్, 10.4 Nm టార్క్, 7.6 సెకన్లలో 0-60 కిమీ వేగం, LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, LED పొజిషన్ లైట్, 14 అంగుళాల అలాయ్ వీల్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ స్పీడోమీటర్, ఫోన్ ఛార్జర్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ కలిగి ఉన్నాయి. ఇక మరోవైపు హీరో Xoom 160 స్కూటర్ 156 సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది. దీని ధర రూ.1.48 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 14.6 bhp పవర్, 14 Nm టార్క్, 4-వాల్వ్ టెక్నాలజీ, స్మార్ట్ కీ, డ్యూయల్ ఛాంబర్ LED హెడ్ ల్యాంప్స్, ABS ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కుషన్‌డ్ సీట్లు, పెద్ద 14 అంగుళాల వీల్స్ అందుబాటులో ఉంటాయి.
ఇక మరోవైపు హీరో Xtream 250R బైక్ విషయానికి వస్తే.. ఈ బైక్ రూ. 1.80 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లాంఛ్ కానుంది. ఇక ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 250 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 30 bhp పవర్, 25 Nm టార్క్, 3.25 సెకన్లలో 60 కిమీ వేగం, 6-స్పీడ్ గేర్ బాక్స్, DOHC మోటార్, 43 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, ప్రిలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్, 17 అంగుళాల అలాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే హీరో Xpulse 210 బైక్ ను చూస్తే.. ఇది ఆఫ్-రోడింగ్ ప్రేమికుల కోసం రూపొందించిన ఈ బైక్ 210 సీసీ ఇంజిన్‌తో వస్తోంది. ఇక ఫీచర్ల పర్ణగా చూస్తే.. ఇందులో 24.5 bhp పవర్, 20.4 Nm టార్క్, 6-స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్, 4.2 అంగుళాల TFT డిస్‌ప్లే, 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటాయి.
Also Read: Elon Musk: డిగ్రీ లేకున్నా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వొచ్చంటున్న మస్క్
ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ కొత్త మోడల్స్ మార్కెట్‌లో హీరో కంపెనీకి మంచి స్థానాన్ని కల్పిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా బజాజ్ పల్సర్, సుజుకీ జిక్సర్ వంటి మోడల్స్‌కు ఇవి గట్టి పోటీగా నిలవనున్నాయి. మొత్తానికి, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హీరో తన ఆవిష్కరణలతో మరోసారి వినియోగదారుల మనసులు గెలుచుకుంటోంది.