Bharat Mobility Expo: స్టైలిష్ లుక్స్… స్మార్ట్ ఫీచర్లు! కొత్త అవతారంలో టాటా నెక్సాన్..
- టాటా నెక్సాన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల
- కొత్త టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు
- 2025 టాటా నెక్సాన్‌లో మారినవి ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా మోటార్స్ ఇటీవల పలు కార్లను కొత్త ఫీచర్లు, వేరియంట్‌లతో అప్‌డేట్ చేసింది. టియాగో, టిగోర్ తర్వాత కంపెనీ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నెక్సాన్ ఇంజన్ మెకానిజంలో ఎటువంటి మార్పు లేదు. కానీ దీనికి కొన్ని కొత్త ఫీచర్లు, వేరియంట్‌లు జోడించారు. కొత్త టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
2025 టాటా నెక్సాన్‌లో మారిన ఫీచర్స్..
Also Read
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
2025 టాటా నెక్సాన్ ఇప్పుడు కొత్త కార్బన్ బ్లాక్, క్రియేటివ్ బ్లూ, రాయల్ బ్లూ, గ్రాస్‌ల్యాండ్ బీజ్ పెయింట్ స్కీమ్‌లతో వస్తుంది. ఇది డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్ కలర్లలో కూడా అందుబాటులోకి రానుంది.కంపెనీ కలర్ ఆప్షన్ జాబితా నుంచి ఫ్లేమ్ రెడ్, ఫియర్‌లెస్ పర్పుల్ రంగులను తొలగించింది. ముఖ్యంగా ఇందులో ఇందులో ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ట్రిమ్ వంటి వేరియట్‌లను నిలిపేసింది. ఇవి కాకుండా రెండు కొత్త వేరియంట్‌లైన.. ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఎస్‌లను జోడించింది.
కొత్త వేరియంట్‌లలో ఫీచర్సు..
ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్-వ్యూ కెమెరా, ఆటో ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMలు), హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి కొన్ని కొత్త ఫీచర్లను చేర్చింది. ఇది కాకుండా, ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్‌లో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, సన్‌రూఫ్ సౌకర్యం కూడా ఉంది. కొత్త క్రియేటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, TPMS, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, వైర్‌లెస్ ఛార్జర్ సౌకర్యం ఉంది.
ఎయిర్ ప్యూరిఫైయర్…
కొత్త వేరింయట్‌లో 360-డిగ్రీ కెమెరాను అమర్చారు. ఇందులో డైనమిక్ టర్న్ సిగ్నల్స్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ ను తీసేశారు. అయితే, క్రియేటివ్+ S వేరియంట్‌లో సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్లు అందించారు. కొత్త టాప్-స్పెక్ ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఇది 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సీక్వెన్షియల్ ఎల్‌ఈడీ డేటైమ్-రన్నింగ్ లైట్లు (DRLలు), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు అందించారు.
శక్తి – పనితీరు: ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ముందు నుంచే ఉంది. సీఎన్‌జీ వెర్షన్ కూడా అందించారు. ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ అమర్చారు. టర్బో పెట్రోల్ ఇంజన్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT), 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT0), 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (AMT), డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) వంటి ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!