మీరు త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీ కోసమే. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 నాక్ కాబోతోంది. ఇది జనవరి 17 నుంచి 22 మధ్య భారత్ లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీల మాదిరిగానే, టాటా మోటార్స్ కూడా అనేక లైనప్‌లను ఆవిష్కరించబోతోంది. భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో కంపెనీ టాటా సియెర్రా ఈవీని ఆవిష్కరించబోతోంది. దీని డిజైన్ ప్రత్యేకంగా ఉండబోతోంది. స్లిమ్ LED DRL, నిలువుగా పేర్చబడిన ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్‌లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్, స్టార్-ప్యాటర్న్ అల్లాయ్ వీల్స్‌తో అందించబడుతుంది. ఈ కొత్త ఈవీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. దాదాపు 500 కి.మీ ప్రయాణించవచ్చు.
READ MORE: TG: పదోన్నతులు పొందిన రవాణా శాఖ అధికారులకు పోస్టింగులు.. ఉత్తర్వులు జారీ
ఫీచర్స్..
కొత్త సియెర్రా సమగ్ర శ్రేణి ఫీచర్లను అందిస్తుంది. ఇందులో వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీని అనుమతించే పెద్ద 12.3-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. డ్యూయల్ స్క్రీన్ డిస్ ప్లేలో ఇన్ఫోటైన్ మెంట్ తో ఇంటిగ్రేట్ చేసి ఉన్న పూర్తి డిజిటల్ క్లస్టర్ ను కూడా డ్రైవర్ పొందే అవకాశం ఉంది. వైర్ లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెథరెట్ అప్ హోల్ స్టరీ ఇంటీరియర్ ఎక్స్ పెక్టేషన్స్ లో ఉన్నాయి. టాటా సియెర్రా అనేక రకాల భద్రతా ఫీచర్లతో కూడిన లెవల్ -2 ఎడిఎఎస్ సూట్ ను కూడా పొందే అవకాశం ఉంది.
READ MORE: Fact Check: కొత్త 500,1000 నోట్లపై మోడీ కీలక ప్రకటన.. వీడియో వైరల్..
ఇది ఐదు డోర్ల వర్షన్ గా వస్తుంది. ముందు భాగంలో ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ ఉంటుంది. ఇది కారు మొత్తం వెడల్పును కవర్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ స్ప్లిట్ హెడ్ ల్యాంప్ లను కలిగి ఉంటుంది. సిల్వర్ ఫినిష్ స్కిడ్ ప్లేట్లతో కూడిన బ్లాక్ బంపర్లు, డ్యూయల్-టోన్ రూఫ్ కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన పనోరమిక్ రియర్ విండో ప్యాన్ ను తీసుకువస్తున్నారు. ఇది ఒరిజినల్ మోడల్ లాగా ఫిక్స్ డ్ విండో కాదు. ఈ కారులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సియెర్రా వెనుక భాగంలో వెడల్పాటి, బాక్సీ ఫెండర్లతో పాటు టెయిల్ లైట్ల కోసం సొగసైన ఎల్ఈడి స్ట్రిప్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ కింద రాప్ రౌండ్ రియర్ విండోపేన్ ఉంటాయి.