తెలుగు చిత్రసీమలో చాలా అంశాలు చరిత్రకు అందక దూరంగా నిలిచాయి. అసలు మన తొలి తెలుగు చిత్రం ‘భక్త ప్రహ్లాద’ ఎప్పుడు విడుదలయిందో మొన్నటి దాకా చాలామందికి తెలియదు. ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలయిందని చాలా రోజులు సాగింది. అయితే లభిస్తున్న సాక్ష్యాధారాల ప్రకారం ‘భక్త ప్రహ్లాద’ చిత్రం 1932 ఫిబ్రవరి 6 విడుదలయింది. అలాగే మన తెలుగు సినిమా రంగంలో తొలి నేపథ్యగాయకుడుగా ఎమ్.ఎస్. రామారావును, తొలి నేపథ్యగాయనిగా రావు బాలసరస్వతీదేవిని చెప్పుకుంటూ…