గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈనేపథ్యంలో.. నిన్న రాత్రి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లారు గవర్నర్. అయితే.. అక్కడి నుంచి భద్రాచలంలో గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్ మాట్లాడనున్నారు. అయితే.. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. గోదావరి…
గోదావరి వరద భయపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పాత రికార్డులు బద్దలు కొట్టి మరీ దూసుకొస్తున్న వరద.. మహా విషాదాన్ని కళ్లకు కడుతోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 1986 లో మేడిగడ్డ ప్రాంతంలో రికార్డు అయిన భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం,…
వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వానలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతీ భద్రాచలం చిగురుటాకులా వణికిపోతోంది. అయితే. 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70 అడుగులు దాటింది. గరిష్ఠంగా పోటెత్తిన వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించింది. నిన్న భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి పది గంటలకు 24.29 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గంటగంటకు పెరుగుతున్న వరదతో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా.. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలు…
గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరిలో నీటి ఉధృతి పెరుగుతోంది.. గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి.. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ఇప్పటికే 70 అడుగులకు చేరువైంది.. మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది.. భద్రాచలానికి వెంటనే హెలికాప్టర్, అదనపు రక్షణ సామగ్రి తరలించండి అంటూ సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో,…