వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వానలకు గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. దీంతీ భద్రాచలం చిగురుటాకులా వణికిపోతోంది. అయితే. 32 ఏళ్ల తర్వాత నీటిమట్టం 70 అడుగులు దాటింది. గరిష్ఠంగా పోటెత్తిన వరద ప్రవాహం ప్రళయాన్ని తలపించింది. నిన్న భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి పది గంటలకు 24.29 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గంటగంటకు పెరుగుతున్న వరదతో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా.. ఇప్పటికే ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారు.
read also: Vivek Agnihotri: స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు.. వాళ్లు ఉన్నంతకాలం బాలీవుడ్ అంతే..!!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరీవాహక ప్రాంతంలో గోదావరి వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి. అయితే.. 77 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 6,155 కుటుంబాలకు చెందిన 20,922 మందిని ఈ కేంద్రాలకు తరలించారు. కాగా.. అర్ధరాత్రి దాటిన తర్వాత వరద నిలకడగా మారుతుందని ప్రచారం సాగినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత రెట్టింపయింది. దీంతో.. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వానలతో.. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయితే.. దుమ్ముగూడెం.. చర్ల మండలాలకు ఈ సమస్య తీవ్రస్థాయిలో తలెత్తడంతో సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. అయితే.. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోవడంతో.. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముంపు ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
ఈనేపథ్యంలో.. గోదావరి వరద 3 జిల్లాల్లో మొత్తం 241 గ్రామాలను ముంచెత్తింది. దీంతో.. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల గ్రామాలపై వరద వచ్చిపడింది. నిన్న శుక్రవారం రాత్రికి కూడా ఇంకా 75 గ్రామాల్లో వరదనీరు చేరింది, పొలాలు పూర్తిగా మునిగిపోగా పలు ఇళ్లలోకి నీరు చేరింది. అయితే ఈ నేపథ్యంలో.. గోదావరి వరద గుప్పిట్లో చిక్కుకున్న ముంపు ప్రాంతాల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. కలెక్టర్ అనుదీప్ తో కలిసి భద్రాచలంలోని శాంతినగర్ కాలనీ, సుభాష్ నగర్ కాలనీల్లో మోకాలి లోతు వరదలో పర్యటన కొనసాగుతోంది. నష్టపోయిన కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి కేంద్రాలకు తరలించి, కరకట్టను పరిశీలించారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రికి ఫోన్ చేశారు. వరదల తీవ్రత, ముంపు ప్రాంతాల్లో అందిస్తున్న చర్యలపై ఫోన్ ద్యారా ఆరా తీసారు.
England: బ్రిటన్ లో భారీగా ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్, ఎమర్జెన్సీ