భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అనుమతుల్లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం, బొల్లోరిగూడెం, నట్రాజ్ సెటర్లలోని పలువురు వ్యాపారుల నివాసాలపై సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు. అనంతరం సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. గుడివాడ చంద్రశేఖర్ వద్ద లెక్కించే యంత్రం, రూ.1,26,560, మంచికంటి సత్యనారాయణ వద్ద నూ.4 లక్షలు, ప్రామిసరీ నోట్లను , పాల్వంచ పట్టణ…
దక్షిణ అయోద్యగా వర్థిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే టిక్కెట్ల విక్రయాలను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టిక్కెట్ల విక్రయాలన్నింటిని ఆన్ లైన్ లో పెట్టామని చేతులు దులుపుకుంటున్నారు దేవస్థానం అధికారులు. ఏ దేవాలయంలో లేని ప్రత్యేకత భద్రాద్రి దేవాలయానికి శ్రీరామ నవమికి ఉంటుంది. శ్రీరామ నవమి నాడు శ్రీసీతారాముల కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో దేశ వ్యాపితంగా అదే సమయంలో…
లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లమందికి తాగునీరు అందిస్తున్న మహానది గోదావరి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అవుతోందా? భద్రాచలం వద్ద గోదావరి కాలుష్య కాసారంగా తయారైందా? గోదావరిలో మునిగితే రోగాలు గ్యారంటీనా? అంటే అవుననే అంటున్నారు. గోదావరికి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. గోదావరిలోకి కెమికల్ నీళ్లు వచ్చి చేరుతున్నాయ్. పంటలు సాగు చేయటానికి ఆ నీటినే వాడుతున్నారు. అలా పండిన పంటలను తిని జనం రోగాల పాలవుతున్నారు. కలుషిత నీటిని తాగి ఆస్పత్రుల్లో చేరుతున్నారు జనం.…
ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్‌కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్‌కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.…
అక్కడ అధికారపార్టీ నేతలకు ఇసుకే బంగారం. ఇసుకపై వచ్చే ఆదాయమే వారికి కీలకం. అటువైపు ఎవరైనా తొంగి చూసినా.. మోకాలడ్డినా సెగలు.. భగభగలు తప్పవు. ఎత్తుకు పైఎత్తులు వేయడంలో వెనకాడరు రాజకీయ నేతలు. ప్రస్తుతం అలాంటి ఓ పంచాయితీ అధికారపార్టీతోపాటు.. అధికారవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భద్రాచలం ఇసుక ర్యాంప్‌పై దుమారం..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక రాజకీయ నాయకులకు, కొందరు అధికారులకు ప్రధాన ఆదాయ వనరు. ఇసుకపై వచ్చే రాబడి పోకుండా.. తమకు అనుకూలురైన అధికారులకు…
భద్రాచలంలో దారుణం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి కూలి పనులు చేస్తున్న ఇద్దరు మైనర్ బాలికల పై అత్యాచారయత్నం చేశారు ఇద్దరు కామాంధులు. తాము ఎంత ప్రాధేయపడ్డ తమను కొట్టి లోటర్చుకోవలని ప్రయత్నించారని అక్కడి నుండి తప్పించుకొని తమవారిని ఆశ్రయించినట్లు బాలికలు చెబుతున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ఇక్ మిరాజ్ గ్రామం నుండి నలుగురూ బాలికలు ఒక యువకుడు భద్రాచలంలో కూలిపనులకు వలసవచ్చారు భద్రాచలం లోని సుందరయ్య నగర్…
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతో్ంది. దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇక అటు వరంగల్ నగరాన్ని మరోసారి వర్షాలు…
పేరుకు అభివృద్ధి అని చెబుతున్నా.. అధికారపార్టీని ఇరుకున పెట్టేలా వైరిపక్షాలు అడుగులు వేస్తున్నాయా? భద్రాచలంలో.. ఆ ఐదు గ్రామాల అంశాన్ని మళ్లీ రోడ్డెక్కించడం వెనక వ్యూహం అదేనా? ఢిల్లీ స్థాయిలో కదలిక తేవాల్సిన చోట.. లోకల్ పాలిటిక్స్ వేడి పుట్టిస్తాయా? ఇంతకీ ఆ ఐదు గ్రామాల రగడేంటి? ఐదు గ్రామాల విలీనంపై ఇరుకున పెట్టే రాజకీయాలు! భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు పిచ్చుకలపాడు, పురుషోత్తమ పట్నం, ఎటపాక, గుండాల, కన్నాయిగూడెంలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్…