ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. భద్రాచలం దగ్గర 43 అడుగులకు చేరింది గోదావరి నీటిమట్టం.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.. గోదావరి పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు.. ఇక, అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.. ఇటు, దేవీపట్నం మండలంలోని 33 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఎగువ కాపర్ డ్యామ్‌పై గోదావరి ఉగ్రరూపం…
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అత్యవసర ప్రాతిపదికన శనివారం మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గం లౌక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో రేపటి నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయని దేవస్థాన యాజమాన్యం తెలిపింది. గత నెల మే 12న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేయగా.. 38 రోజుల అనంతరం భక్తుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భద్రాచలం శ్రీ…
ప్రతి ఏడాది రాములోరి కళ్యాణాన్ని భద్రాచలం రామాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. రాములోరి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. అయితే, గతేడాది కరోనా లాక్ డౌన్ కారణంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించారు. భక్తులు లేకుండానే కళ్యాణం జరిగింది. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మరోసారి ఆలయాలు మూతపడ్డాయి. ఈరోజు జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా భక్తులు…