తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు భద్రాద్రి శ్రీ రాముని దర్శించుకోనున్నారు. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరుగనున్న తిరుకల్యాణ మహోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కల్యాణోత్సవం రాష్ట్రవ్యాప్తంగా భక్తులకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి స్వయంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇది సంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహించబడే కార్యక్రమాలలో భాగం.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరగనుంది. మిథిలా స్టేడియంలోని శిల్ప కళాశోభిత కళ్యాణ మండపం ఈ మహోత్సవానికి వేదిక కానుంది. ప్రత్యేక ఆకర్షణగా, తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 2016 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ…
AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ రోజు (ఏప్రిల్ 5న) భద్రాచలం వెళ్ళనున్నారు. రేపు భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఒక్క రోజు ముందుగానే ఖమ్మం జిల్లాకు వెళ్తున్నారు.
Rythu Bandhu : మరో రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఈరోజు మంత్రి ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలించడం జరుగుతుందని, అవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతుబంధు నిధులు మరో రెండు రోజుల్లో జామవుతాయని చెప్పారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ…
భద్రాచలం పట్టణంలో ఓ ఆధ్యాత్మిక సంస్థ నిర్మిస్తున్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భవనం కింద శిథిలాల్లో ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు. బుధవారం సాయంత్రం నుంచి శిథిలాల తొలగింపు చర్యలు ప్రారంభించారు. గత రాత్రి బతికి ఉన్నాడని భావించి కామేష్ అనే మేస్త్రీని బయటికి తీసుకు రావడానికి సింగరేణి రెస్క్యూ బృందం తీవ్రంగా ప్రయత్నం చేసింది. తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అయితే బయటకు తీసుకొచ్చే సమయానికి అతడు మృతి…
భద్రాద్రి జిల్లాలో ఇసుక పేరుతో ఏదేదో జరిగిపోతోందా? శాండ్ పాలిటిక్స్ సలసల కాగుతున్నాయా? బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన కాంట్రాక్టరే ఇప్పుడు కూడా హవా నడిపిస్తున్నాడా? ఇసుక ర్యాంప్ల పేరుతో అక్కడేం జరుగుతోంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక బంగారంతో సమానం. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం రీచ్ల అలాట్మెంట్ జరక్కపోవడంతో…అక్రమ రవాణా అడ్డగోలుగా జరిగిపోతోంది. ఇసుక వ్యాపారంలో గిరిజనుల్ని ప్రోత్సహించేలా…. సొసైటీలకు అప్పగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నారు.…
TGSRTC: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేసే పవిత్ర కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది.
Bhadrachalam: భద్రాచలంలో ప్రతీ ఏటా వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి. భక్తులు శ్రీరాముని కల్యాణాన్ని నేరుగా తిలకించేందుకు సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. ఏప్రిల్ 6న జరిగే శ్రీరామనవమి వార్షిక కల్యాణోత్సవం కోసం భక్తులు సెక్టార్ టికెట్లను దేవస్థానం వెబ్సైట్ bhadradritemple.telangana.gov.in ద్వారా కొనుగోలు చేయవచ్చు. Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి..…
Ganja Smuggling: భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తూ, తనిఖీల్లో ఉన్న కానిస్టేబుల్ను ఢీకొట్టి పరారైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ యోగేంద్ర చారి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ తెల్లవారుజామున భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిపై గంజాయి స్మగ్లర్లు బైక్తో దాడి చేశారు.…