Cyber Security SP: బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై సరైన క్లారిటీ లేదు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్సీ ప్రసాద్ అన్నారు. 2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణాలో ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయింది.
తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. యాంకర్ శ్యామల పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది. ‘Andhra365’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)…
మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తామన్నారు.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు.
బెట్టింగ్ యాప్స్ వివాదంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హీరోలు, హీరోయిన్ల మీద కేసులు పెట్టడం మంచి పరిణామం అన్నారు. కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.. వీళ్ళ ప్రమోషన్ కారణంగా అమాయకులు బలవుతున్నారని మండిపడ్డారు.. మీరు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని.. మీరు సంపాదించుకున్న సంపాదనను కనీసం చారిటీల ద్వారా ఖర్చు చేయాల్సిందన్నారు. మీకు ఎందుకు ఇంత…
అర్జున్ S/o వైజయంతి థియేట్రికల్ బిజినెస్ అదిరింది నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని…
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు…
తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ. SLBC టన్నెల్‌లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ…
తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై…
Supritha : నటి సురేఖ వాణి కూతురు సుప్రీత చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిన్న 11 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసులు పంపుతున్నారు. ఈ క్రమంలోనే అరెస్టులు తప్పవనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సుప్రీత కూడా మొన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను తెలియక తప్పు చేశానని..…