Tragic: హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ కొడుకు తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. మాదాపూర్‌కు చెందిన హనుమంతు అనే వ్యక్తి తన కొడుకు రవీందర్ చదువు కోసం సుమారు ఆరు లక్షల రూపాయలు ఇచ్చాడు. అయితే ఆ మొత్తాన్ని చదువుల మీద కాకుండా, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టి పోగొట్టేశాడు రవీందర్. ఈ విషయం తెలుసుకున్న తండ్రి తీవ్రంగా మందలించాడు. Kasam…
బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
బెట్టింగ్ యాప్‌లు ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి సంపాదిస్తామన్న ఆశతో వాటి మోజులో పడి.. ఉన్న డబ్బునంతా పోగొట్టుకోవడమే కాదు.. అప్పులు చేసి మరి బెట్టింగ్‌లు పెట్టి.. చివరకు లక్షల్లో అప్పులు కావడం.. తీర్చే స్తోమత కూడా లేకుపోవడంతో.. ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతో మంది యువకులు.. తాజాగా, బెట్టింగ్ యాప్ లకు విశాఖపట్నంలో మరో యువకుడు బలి అయ్యాడు..
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసులో 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించారు. మరోవైపు.. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు సీట్ తో పాటు కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఏరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కి దృష్టికి తీసుకెళ్లారు.. నా అన్వేషణ ఫేం అన్వేష్.. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.. నా అన్వేష్ పోస్టు చేసిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. "బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత.. నిరాశలోకి నెట్టబడుతున్నారు.. నేను వందలాది హృదయ విదారక కథలను వింటున్నాను. ఇది…
Online Betting : హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు యువత జీవితాలను బలిగొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అత్తాపూర్ రెడ్డి కాలనీలో మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో ఎం.టెక్ చదువుతున్న విద్యార్థి పవన్ (23) బెట్టింగ్ యాప్‌లలో భారీగా నష్టపోయి, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ దుర్ఘటన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల కలిగే ప్రమాదాలను మరోసారి గుర్తు చేస్తోంది. అత్తాపూర్ రెడ్డి కాలనీలో నివాసముంటున్న పవన్,…
Rithu Chowdari : రీతూ చౌదరి మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. మొన్న బెట్టింగ్ యాప్స్ కేసులో ఆమె విచారణ కూడా ఎదుర్కుంది. అప్పటి నుంచి కొంత బ్రేక్ తీసుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది. వరుసగా పోస్టులతో కుర్రాళ్లకు అందాల వల విసురుతోంది. ఖమ్మంకు చెందిన ఈ బ్యూటీ.. మొదట్లో సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడి నుంచే ఆమెకు సోషల్ మీడియాలో…
Adi Reddy : ఇప్పుడు టాలీవుడ్ ను బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కుదిపేస్తోంది. చిన్న సెలబ్రిటీల దగ్గరి నుంచి స్టార్ హీరోల దాకా అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో చిక్కుకున్నారు. చాలా మందిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా పోలీసు స్టేషన్ కు రావడం కలకలం రేపింది. ఆయన స్టేషన్ కు రావడంతో ఆయనపై కూడా కేసు నమోదైందేమో అనే ప్రచారం జరిగింది. దానిపై ఆదిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ‘నేను…
Sivabalaji : ఇప్పుడు దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఈ బెట్టింగ్ యాప్స్ భూతానికి వేలాది మంది అమాయకులు బలైపోయారు. ఆ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల మీద కేసులు నమోదయ్యాయి. విచారణకు కూడా వెళ్తున్నారు. కొందరు తమకు తెలియక చేశామని క్షమించమని కోరుతున్నారు. ఇంకొందరేమో లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేశామని సర్ది చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో తమకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్…
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి.