Anchor Shyamala: హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల!
- ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం
- పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు
- హైకోర్టును ఆశ్రయించిన శ్యామల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని ఆమె పిటిషన్ వేశారు. యాంకర్ శ్యామల పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదయింది. ‘Andhra365’ అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు శ్యామల ప్రమోషన్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త బెట్టింగ్ యాప్‌లు పుట్టుకొచ్చాయి. గతంలోని యాప్‌లు సహా కొత్త వాటి టార్గెట్ సామాన్య, మధ్య తరగతి ప్రజలే. బెట్టింగ్ యాప్‌ల వల్ల అప్పుల పాలై ఇటీవల కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం వల్ల సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యాంకర్‌లు, బుల్లితెర నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read
సోషల్ మీడియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో స్టార్స్ దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ సహా అనన్య నాగళ్ల, శ్రీముఖి, సిరి హనుమంతు, వర్షిణి సౌందర్‌రాజన్, విష్ణుప్రియ, శోభా శెట్టి, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, టేస్టీ తేజలు.. ఉన్నారు. విష్ణుప్రియ, రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు.
తాజావార్తలు
-
Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..