Supritha : నటి సురేఖ వాణి కూతురు సుప్రీత చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిన్న 11 మంది సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసులు పంపుతున్నారు. ఈ క్రమంలోనే అరెస్టులు తప్పవనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సుప్రీత కూడా మొన్న ఓ వీడియోను రిలీజ్ చేసింది. తాను తెలియక తప్పు చేశానని.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలంటూ కోరింది. ఎవరూ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవొద్దని.. తాను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయబోనని చెప్పుకొచ్చింది.
Read Also : Shashank Singh: పృథ్వీ షా తిరిగి సక్సెస్ సాధించగలడు.. యంగ్ క్రికెటర్ సలహా
ఆమె వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆమెపై కేసు నమోదైంది. దీంతో అరెస్ట్ చేశారేమో అనే వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో సుప్రీత స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరింది. తాను సేఫ్ గా ఉన్నానని.. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదంటూ తెలిపింది. ప్రస్తుతం మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అప్ డేట్ ఇవ్వలేకపోయినట్టు తెలిపింది. ఆమె వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలు నీ గురించి ఎవరు అడిగారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.