Opposition meet: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐక్యతను పెంపొందించడానికి ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం జూన్ 23న బీహార్‌లోని పాట్నాలో జరిగింది. 24 రాజకీయ పార్టీల నాయకులు జూలై 17న బెంగళూరులో సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ మరుసటి రోజు మరిన్ని అధికారిక చర్చలు జరుగుతాయి. ఈ సమావేశంలో పార్టీల మధ్య విస్తృత అంగీకారానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Also Read: Modi Tour: మరో 26 రాఫెల్ విమానాలు.. ప్రధాని ఫ్రాన్స్ పర్యటన వేళ కీలక ఒప్పందానికి ఛాన్స్
ఎనిమిది కొత్త పార్టీలు.. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలు జూలై 17న సమావేశంలో చేరే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చీలిక తర్వాత సమావేశం జులై 13 నుంచి జులై 17కి వాయిదా పడింది.
Also Read: Union Cabinet Expansion: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ మార్పులు ఉంటాయా?
పాట్నాలో జరిగిన మొదటి సమావేశంలో, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలని 15 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ బహిరంగంగా మద్దతు ఇచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ అటువంటి సమావేశాలలో భాగం కావడం కష్టమని తేల్చిచెప్పడంతో విభేదాలు వెలువడ్డాయి. పాట్నా సమావేశం తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో.. ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను సరళమైన విధానంతో పక్కన పెట్టి ఉమ్మడి ఎజెండా, రాష్ట్రాల వారీ వ్యూహంతో ఎన్నికల్లో పోరాడతాయని చెప్పారు.