ఆర్టీసీ బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణం ప్రమాదకరం. ఫుట్‌బోర్డు దగ్గర ఎవరూ నిలబడొద్దని కండక్టర్ హెచ్చరిస్తుంటాడు. బస్సు ఎక్కే ప్రయాణికులకు ఇబ్బంది ఉండకూడదని.. అలాగే ఫుట్‌బోర్డు ప్రమాదకరమని కండక్టర్లు హెచ్చరిస్తుంటారు. ఈ మాటే ఒక వ్యక్తికి రుచించలేదు. కండక్టర్ ఆ మాట అన్నందుకు ఏకంగా హత్య చేసేందుకు రెడీ అయ్యాడు.
Flipkart’s Rs 1 Auto Ride in Bengaluru: ఈ ఫెస్టివల్ సీజన్లో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ 2024ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27 నుంచే మొదలైన ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉన్నాయి. దాంతో సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అయితే సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్లో భాగంగా బెంగళూరు వాసులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.…
Bomb Threat: బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం, బాంబు స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. హోటల్‌పై బాంబు పెట్టే ప్లాన్ ఈమెయిల్ ద్వారా అందినట్లు సమాచారం. బెదిరింపుతో కూడిన ఇమెయిల్ గురించి…
Mahalakshmi Murder: బెంగళూరు మహాలక్ష్మి కేసులో ప్రధాన నిందితుడు ముక్తి రంజన్ ప్రతాప్ రేయ్ ఆత్మహత్య తర్వాత మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రంజన్ ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లికి ఈ సంఘటన గురించి మొత్తం చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ- జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించాలని ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించాగా.. సహనం కోల్పోయిన ఆయన, మైక్‌లను పక్కకు తోసేసి.. అవసరమైతే నేనే పిలిచి మాట్లాడుతాగా అంటూ సీరియస్ అయ్యారు.
Bengaluru woman Murder: బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణహత్యకు గురైంది. బాధితురాలు అద్దెకు ఉంటున్న నివాసంలోని ఫ్రిజ్‌లో ఆమె తెగిపడిన శరీర భాగాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అత్యంత కిరాతకంగా మహాలక్ష్మీని నరికి 52 భాగాలు చేశాడు. ఈ ఘటన యావత్ దేశంలో సంచలనంగా మారింది. మరో శ్రద్ధావాకర్ హత్యను తలపించేలా ఈ ఘటన జరిగింది. గది నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Triangle Love: ‘‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’’ చివరకు విషాదంగా మారింది. అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడటం హత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళూర్ లోని సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 24 ఏళ్ల వరుణ్ కోటియన్ అనే యువకుడి హత్య జరిగింది. ఉడిపికి చెందిన వరుణ్ని అతడి స్నేహితుడు దివేష్(25) బెంగళూర్‌లోని గెద్దలహళ్లీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో హత్య చేశాడు.
Bengaluru chilling murder: శ్రద్ధావాకర్ తరహాలోనే బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణ హత్య జరిగింది. ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన వైనం ఒళ్లు గగుర్పాటు గురయ్యేలా ఉంది. తాజాగా ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సోమవారం తెలిపారు.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మీ (29) అనే మహిళ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనంగా మారింది. మహాలక్ష్మీని ముక్కలు.. ముక్కలుగా నరికి గదిలో రిఫ్రిజిరేటర్లో పెట్టడంతో దుర్వాసన వెదజల్లింది. దాదాపు 50 ముక్కలుగా నరికివేయబడింది.