Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annapurna Studios: తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అన్నపూర్ణ స్టూడియోస్. ఈరోజు 51వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. #51YearsOfAnnapurnaStudios హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో కూడా ఈ వార్షికోత్సవం సందడి చేస్తోంది. 51 ఏళ్ల క్రితం నాటుకున్న ఈ లెగసీ ఇప్పటికీ సినిమా ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తూనే వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ గత ఐదు దశాబ్దాలుగా ప్రతిభను పెంపొందించడం, అద్భుతమైన కథలను తెరకెక్కించడం, తెలుగు సినిమాపై అజరామర ముద్ర వేయడం వంటి కార్యకలాపాలతో ముందుకు సాగుతోంది.
నటసార్వభౌమ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) స్థాపించిన ఈ స్టూడియో ఆయన విజన్‌తో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలకు నిలయంగా నిలిచింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాద్‌కు తరలిరావడంలో మైలురాయిగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్, నేటితో (2026 ఆగస్టు 13) విజయవంతంగా 51వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) కన్న ఒక చిన్న కల, నేడు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
చారిత్రాత్మక పునాది
1975 ఆగస్టు 13న అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమైంది. తెలుగు సినిమాకు స్వయంప్రతిపత్తి కావాలని, పరిశ్రమ హైదరాబాద్‌లోనే స్థిరపడాలని ఏఎన్నార్ ఈ స్టూడియోను స్థాపించారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ పేరిట వెలిసిన ఈ ప్రాంగణం, వందలాది క్లాసిక్ చిత్రాల నిర్మాణానికి వేదికైంది. ఏఎన్నార్ సారధ్యంలో ఈ స్టూడియో ఉన్నత శిఖరాలకు చేరుకుంది.
కింగ్ నాగార్జున సారథ్యం
ఏఎన్నార్ వారసత్వాన్ని అందుకున్న కింగ్ అక్కినేని నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్‌ను కేవలం షూటింగ్ లొకేషన్గానే కాకుండా గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చారు. అత్యాధునిక సౌండ్ రికార్డింగ్ థియేటర్లు, డిజిటల్ కలర్ గ్రేడింగ్ (DI) ల్యాబ్‌లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త ‘వర్చువల్ ప్రొడక్షన్’ (Virtual Production) సాంకేతికతను ఇక్కడికి తీసుకువచ్చారు.
అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్
సినిమా రంగానికి సేవలు అందించడమే కాకుండా, రాబోయే తరాన్ని తీర్చిదిద్దేందుకు నాగార్జున చొరవతో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియాను ఇక్కడ స్థాపించారు. ఎంతోమంది యువ దర్శకులు, ఎడిటర్లు, నటీనటులు ఇక్కడ శిక్షణ పొంది పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. 50 ఏళ్ల మైలురాయిని దాటి 51వ ఏటా అడుగుపెడుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం వెండితెరకే కాకుండా ఓటీటీ, టెలివిజన్ రంగాలకు సైతం పెద్ద దిక్కుగా నిలిచింది. ఈ 51వ వార్షికోత్సవం అక్కినేని కుటుంబానికే కాకుండా, యావత్ తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. అలాగే కింగ్ నాగార్జున సారధ్యంలో మరిన్ని విజయాలలో అన్నపూర్ణ స్టూడియోస్ కీలక పాత్ర పోషించాలని తెలుగు ప్రజలు కూడా కోరుకుంటున్నారు.
- Tags
- annapurna studios
- cinema
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!