Crime: బెంగళూర్‌తో దారుణం జరిగింది. ప్రియురాలని కత్తితో పొడిచి ఓ వ్యక్తి హత్య చేశారు. ఇద్దరూ కూడా శనివారం నగరంలోని సర్వీస్ అపార్ట్మెంట్ లాబీలోకి ప్రవేశించేటప్పుడు నవ్వుతూ కనిపించారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని ప్రధాన కార్యాలయాన్ని మరొక చోటకు మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టు సమీపంలోకి మారుస్తోంది.
Father kills son: చదువుకునేందుకు నిరాకరించినందుకు తన 14 ఏళ్ల కొడుకుని తండ్రి హత్య చేసిన ఘటన బెంగళూర్‌లో జరిగింది. ఈ ఘటనపై కేఎస్ లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తేజస్ అనే పిల్లాడు పాఠశాలకు వెళ్లడం మానేయడంతో పాటు చదువుని నిర్లక్ష్యం చేసినందు కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.
Bengaluru: ఒక యువతి, ఆటో డ్రైవర్‌కి జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు యువతి ఒకేసారి రెండు ఆటోలను బుక్ చేసి, చివరి నిమిషంలో ఒక దానిని క్యాన్సిల్ చేసినట్లు ఆటో డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన బెంగళూర్‌లో జరిగింది. అయితే, తాను బుక్ చేయలేదని యువతి, ఆటో డ్రైవర్ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒకానొక సమయంలో యువతి ఆవేశంతో ఆటో డ్రైవర్ని దుర్భాషలాడింది. ఈ…
Bengaluru: బెంగళూర్‌లో ఓ జంట తమ అపార్ట్మెంట్లోని బాల్కనీలోనే గంజాయి సాగు మొదలుపెట్టారు. సిక్కింకి చెందిన ఈ జంటన బెంగళూర్‌లో తాము నివాసం ఉంటున్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. సిక్కింకి చెందిన కె. సాగర్ గురుంగ్ (37), అతని భార్య ఊర్మిళ కుమారి (38) తమ బాల్కనీలోని రెండు కుండాల్లో అలంకార మొక్కలతో పాటు గంజాయిని నాటారు.
బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు వేగంగా దూసుకుపోతుండగా ఒక్కసారిగా డ్రైవర్ కిరణ్ కుమార్‌కు (40) గుండెపోటు వచ్చింది. వెంటనే ఎడమ వైపునకు ఒరిగిపోయాడు.
బ్రిటన్ రాజు పర్యటన అంటే ఎంతో హడావుడి.. హంగామా ఉంటుంది. అలాంటిది బ్రిటన్ రాజు చార్లెస్ దంపతులు భారత్‌లో పర్యటిస్తున్నారంటే ప్రొటోకాల్ ప్రకారం భారీ బందోబస్తు.. పోలీసుల హడావుడి ఉంటుంది. అలాంటిది చార్లెస్ దంపతులు గత వారం నుంచి దక్షిణ భారత్‌లోని బెంగళూరులో ఉంటున్న సంగతి ఎవరికీ తెలియలేదు.
బెంగళూరులో గత 12 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన రంజాన్ షేక్ (38) అలియాస్ మహమ్మద్ రంజాన్ షేక్‌ను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్లోని నారైల్ నివాసిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజాన్ షేక్ 2012 నుంచి బెంగళూరులోని చిక్క బనహళ్లిలో నివాసం ఉంటూ చెత్త వ్యాపారం చేస్తున్నాడు. అతడి వద్ద నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా ఉన్నాయి.
తాజాగా బెంగళూరు నగరంలో మరోసారి అలాంటి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బుధవారం సాయంత్రం మహానగరంలో భారీ వర్షం పడింది. దీంతో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టెకీలంతా తమ పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఫ్లైఓవర్‌పై పెద్ద ఎత్తున జామ్ నెలకొంది.
బెంగళూరులో గత వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం అయితే 27 ఏళ్ల రికార్డును చెరిపివేస్తూ భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్థం అయింది. ఇదిలా ఉంటే వర్షాలు కారణంగా నిర్మాణంలో భారీ అంతస్తు బిల్డింగ్ కూలిపోయింది.