ATM Cash Van Robbery Case: ఈ నెల 19న బెంగళూరు..సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినీ ఫక్కీలో దోచుకోవడం కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో అనుసరించింది దోపిడీ దొంగల ముఠా. కొంతదూరం వెళ్లిన తర్వాత క్యాష్ వెహికల్‌ను అడ్డగించి.. తాము సీబీఐ అధికారులమని చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ…. వ్యాన్‌లోని గన్‌మెన్, ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం…
Bengaluru: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉగ్రవాది, సీరియల్ కిల్లర్‌లకు వీఐపీ సౌకర్యాలు కల్పించారు! జైలు లోపల ఉన్న అపఖ్యాతి పాలైన ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు సామాన్య జనాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. వీటిపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు.
ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఓ వ్యక్తి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్‌పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. అది కాస్త ఆలస్యంగా…
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చందాపుర హెడ్‌మాస్టర్ లేఔట్ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అత్యంత కుళ్లిన స్థితితో ఉన్న యువతి నగ్న మృతదేహాన్ని సోమవారం సూర్యనగర పోలీసులు స్వాధీనం చేసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి మరణించిన ఇంట్లో ఒడిశాకు చెందిన సపన్ కుమార్ (40) ఉండేవాడని పోలీసులు…