బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చందాపుర హెడ్‌మాస్టర్ లేఔట్ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అత్యంత కుళ్లిన స్థితితో ఉన్న యువతి నగ్న మృతదేహాన్ని సోమవారం సూర్యనగర పోలీసులు స్వాధీనం చేసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
యువతి మరణించిన ఇంట్లో ఒడిశాకు చెందిన సపన్ కుమార్ (40) ఉండేవాడని పోలీసులు గుర్తించారు. సపన్‌తో కలిసి అద్దె ఇంట్లో యువతి (28) ఉండేదని అనుమానిస్తున్నారు. మృతదేహం పక్కన మద్యం సీసాలు, సిగరేట్లు, భోజనం పార్సెల్స్ ఉన్నాయి. దాంతో హత్యకు ముందు వారిద్దరూ మద్యం తాగారని అర్ధమవుతోంది. ఐదు రోజుల నుంచి ఇంటి తలుపులు తీయలేదు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సంచరం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగలకొట్టి.. లోపలకు వెళ్లగా యావతి నగ్న మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహంను ఆసుపత్రికి తరలించారు.
Also Read: Lover Movie OTT: ‘లవర్’ ఓటీటీ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యువతి ఎవరనే వివరాలూ ఇంకా తెలియలేదు. సవన్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని మొబైల్ ఫోన్ పనిచేయడం లేదని అధికారులు వెల్లడించారు. సపాన్ మాత్రమే కాదు ఫ్లాట్ అద్దెకు ఇచ్చిన వ్యక్తి కూడా కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు యువతిపై లైంగిక దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.