ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సరిపడ ఇంధనం లేకపోకపోవడంతో కెప్టెన్ 'మేడే కాల్' చేశాడు. దీంతో విమానం బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా.. తాజాగా బయటకు వచ్చింది.
పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఒక మహిళా వైద్యురాలు సంస్కారం మరిచి విమానంలో హద్దులు దాటి ప్రవర్తించింది. విమాన సిబ్బంది వారించినా పట్టించుకోకుండా ఒక డాన్‌లో ప్రవర్తించింది.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఈనెల 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా రూ.12 కోట్లకుపైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు చేయగా రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో బెంగళూర్ వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. బెంగళూర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన సేవలపై ప్రభావం చూపిస్తున్నాయని ఇండిగో ఎక్స్‌లో పేర్కొంది. తమ బృందాలు వాతావరణాన్ని గమనిస్తున్నాయని, పరిస్థితులు మెరుగైన తర్వాత సకాలంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది.
కన్నడ నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తాజా వివరాలను వెల్లడించింది. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా రన్యా రావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్‌కు 26 ట్రిప్పులు చేసి వారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని డీఆర్ఐ కోర్టుకు తెలిపింది.
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం ఏదైనా ఉందంటే అది నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడమే. ఈమె వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్న రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. తాజాగా మరో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. రన్యారావుపై డీఆర్ఐ అధికారులకు ఫిర్యాదు చేసింది ఆమె భర్తేనని తెలిసింది. పెళ్లైన రెండు నెలల…
బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు, నటి రన్యారావు స్నేహితుడు, అట్రియా హోటల్ యజమాని మనవడు తరుణ్ రాజును బెంగళూరులో డీఆర్ఐ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. తరుణ్ రాజును కోర్టులో హాజరుపరచగా ఐదు రోజులు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.. తరుణ్ రాజును విచారిస్తు్న్నారు.
బెంగళూరు నుండి కొచ్చికి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలోని ఇంజిన్ లలో ఒకదానిలో మంటలు చెలరేగడంతో శనివారం అర్థరాత్రి బెంగళూరు విమానాశ్రయంలో “అత్యవసర ల్యాండింగ్” చేసింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు బెంగళూరు విమానాశ్రయం ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. విమానం, IX 1132, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 11.12 గంటలకు ల్యాండ్ అయింది. విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల…
కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10 పసుపు అనకొండలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అతని చెక్-ఇన్ బ్యాగేజీలో సరీసృపాలు దాగి ఉన్నాయి.
Valentine Day : ప్రేమికుల రోజును ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రజలు గులాబీ పువ్వులు లేదా గులాబీ బొకే ఇచ్చి వారి ప్రేమను ఆశ్చర్యపరుస్తారు.