బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ నేడు నగరానికి రానున్నారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ నగరం అంతా కషాయి జండాలతో రెపలాడుతున్నాయి. మోడీ ని ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు సీఎస్…
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవీయేషన్ షో (Wings India Aviation Show) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వివిధ సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన దగ్గర నుంచి ఏర్పాట్లు వరకూ అన్ని ఫెయిలయ్యాయి. దీంతో ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు పెద విరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వింగ్స్ ఇండియా 2022కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో గల అనేక సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించాయి. దేశ, విదేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు…
హైదరాబాద్ నగరంలో అందరూ ఎదురుచూస్తున్న ఎయిర్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు వేదికగా పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసులను కనువిందు చేయనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దాదాపు…