BJP MLA: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దని ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ సలహా ఇచ్చారు. బీడ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీకి వెళ్లే హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని, ఇంట్లో యోగా సాధన చేయాలని సూచించారు. కుట్ర జరుగుతోందని, ఎవరిని నమ్మాలో వారికి తెలియదని ఆయన అన్నారు.
Maharashtra: మహారాష్ట్ర బీడ్ జిల్లాలో లింగమార్పిడి చేయించుకున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ మగబిడ్డకు తండ్రయ్యాడు. మజల్ గావ్ తాలుకాలోని రాజేగావ్‌కి చెందిన లలిత్ కుమార్ సాల్వే జనవరి 15న మగబిడ్డకు తండ్రి అయ్యాడు. ఇతను 2020లో లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని పురుషుడిగా మారాడు. ఆ తర్వాత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు.
Sand mafia: మహారాష్ట్రలో ఇసుక మాఫియా బరితెగించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ను హతమర్చే యత్నం చేసింది. ఇసుకతో వెళ్తున్న లారీని ఆపేందుకు యత్నించిన కలెక్టర్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అక్రమంగా ఇసుకను తవ్వి రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ ను బీడ్ జిల్లా కలెక్టర్ నిలువరించే సమయంలో ఈ ఘటన జరిగింది.