Sonusood: కరోనా కాలంలో నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సాయం అందించారు. నేటికీ తన సంస్థ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని నటుడు సోనూ సుద్ పేరిట 69 వేల రూపాయలను స్వాహా చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
సరస్సులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఎంతో మంది ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత సోనూసూద్ తన ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాడని సైబర్ నేరగాళ్లు సాయం సొమ్మును స్వాహా చేశారు. Any Desk app డౌన్ లోడ్ చేసుకోమని చెప్పి మొత్తం ఓటీపీలు తీసుకుని ఆన్ లైన్ లో రూ.69 వేల 566 దోచుకున్నట్లు తేలింది. ఈ మేరకు బీడ్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Read Also: Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు
మార్చి 21న జైరామ్ హరిభౌ చౌదరి కుమారుడు, ఇద్దరు మేనల్లుళ్లు బీడ్‌లోని కేజ్ తాలూకాలో సరస్సులో మునిగి చనిపోయారు. చౌదరి కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోవడంతో సామాజిక బాధ్యతగా బంధువులు, స్నేహితులు ఆర్థికంగా ఆదుకున్నారు. ఈ డబ్బుపైన సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. మార్చి 30న సోనూసూద్ ఫౌండేషన్ కార్యాలయం నుంచి జైరామ్‌కు కాల్ వచ్చింది. ‘‘నేను నీకు రూ.3 లక్షల రూపాయల సాయం చేస్తా.. అందుకు నేను అడిగిన సమాచారం చెప్పాలి.. Any Desk appను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ తదితర సమాచారం తీసుకున్నాడు.
Read Also: Mp Margani Bharat: జగన్ ముందస్తుకి వెళ్ళే ఛాన్స్ లేదు
వివిధ ఓటీపీలు తీసుకుని వారి ఖాతా వరుసగా ఆపై 10 వేలు, 9,999, 18,321, 18,297, 5 వేలు, 4,800, 3049 మొత్తం రూ.69,566 రూపాయలు ఆన్‌లైన్‌లో డ్రా అయ్యాయి. డబ్బు కట్ అయిందని తెలుసుకున్న చౌదరి మళ్లీ అదే నంబర్‌కు ఫోన్ చేశాడు. కానీ, ఆ నంబర్ స్విచ్ఛాఫ్ అయింది. తాను మోసపోయానని తెలుసుకున్న చౌదరి మొదట యూసుఫ్వాద్‌గావ్‌ను ఆశ్రయించి సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ వ్యవహారంపై సైబర్ ఠాణాలో కేసు నమోదైంది.