KGF Chapter 2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాఖీ భాయ్ దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇప్పటికే నెలకొన్న పలు పాన్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టే దిశగా ప్రశాంత్ నీల్ మ్యాగ్నమ్ ఓపస్ మూవీ దూసుకెళ్తోంది. ఒక్క కన్నడలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ “కేజీఎఫ్-2” సందడే కన్పిస్తోంది. ఈ సీక్వెల్ తో యష్ కు మరింతగా క్రేజ్ పెరిగింది. అయితే యష్ “కేజీఎఫ్ 2”, విజయ్ “బీస్ట్” చిత్రాలు కేవలం ఒక్కరోజు గ్యాప్…
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దక్షిణాదిన ఒక్కరోజు తేడాలో రెడు బడా స్టార్స్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఆడియన్స్ తీర్పుకోరాయి. అందులో మొదటిది విజయ్ నటించిన ‘బీస్ట్’. ఇది బుధవారం అనగా ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అయితే ఈ సినిమా మీద విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ‘బీస్ట్’ ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…
అభిమానం.. ఎవరు ఆపినా ఆగనిది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పోస్టర్లు, ఫ్లెక్సీలు.. పూలదండలు.. పేపర్లు ఎగరేయడాలు.. అబ్బో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే వారికి పండగే అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభిమానం హద్దుమీరుతుంది. తమ హీరో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుందని ప్రాణాలను కూడా తీసుకున్న అభిమానులను చూసాం.. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానుల…
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులందరూ రెండు సినిమాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీస్ కెజిఎఫ్ 2 ఒకటి కాగా దీనికి పోటీగా వస్తున్న బీస్ట్ ఒకటి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో అని ప్రతి ఒకరు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే కెజిఎఫ్ 2 టీమ్ దేశం అంతా తిరిగి అభిమానుల అటెన్షన్ గ్రాఫ్ చేస్తుంటే కోలీవుడ్ హీరో విజయ్ మాత్రం ఒక్క…
ప్రస్తుతం సినిమా ఎలా ఉంది అన్నదానికన్నా ఆ సినిమా ప్రమోషన్స్ ఎలా చేశారు అనేదాని గురించే ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావాలంటే ముందు దానికి ప్రమోషన్స్ చేసి జనాలలో ఆ పేరును నానిస్తే అప్పుడు ఆ ప్రొడక్ట్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీశామన్నది కాదు ప్రమోషన్స్ కి ఎన్ని కోట్లు ఖర్చుపెడుతున్నాం అనేది ముఖ్యం అంటున్నారు…
‘ఆర్ఆర్ఆర్’ సందడి సద్దుమణుగుతోంది. ‘కెజిఎఫ్-2’ హీట్ మొదలైంది. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఇక దీనికి పోటీగా ఓ రోజు ముందు ‘బీస్ట్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో దేనికి ఆదరణ దక్కుతుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్. వరుస విజయాలతో కోలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుగున్న విజయ్ ‘బీస్ట్’లో హీరో కాగా, లక్కీ బ్యూటీ కన్నడ కస్తూరి పూజా హెగ్డే కథానాయిక. నెల్సన్ దిలీప్ కుమార్…
ప్రస్తుతం టాలీవుడ్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోల సరసన అమ్మడు నటిస్తున్న సినిమాల లైన్ పెరిగిపోవడంతో పూజా టాలీవుడ్ లక్కీ చార్మ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన పూజా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. ఇకపోతే గత కొన్నిరోజుల నుంచి ఈ బడా…
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే రాధేశ్యామ్ సినిమా మిక్స్డ్ టాక్ తో నిరాశ చెందిన ఈ భామ ప్రస్తుతం బీస్ట్ పైనే ఆశలు పెట్టుకుంది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక రిలీజ్ కి ఇంకో మూడు రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం.…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు, ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. దీంతో మేకర్స్ అన్ని చోట్లా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. అయితే విజయ్ మాత్రం కోలీవుడ్ కి మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నాడట. తెలుగు ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వనని చెప్తున్నాడట.…
దళపతి విజయ్ తాజా చిత్రం “బీస్ట్”కు ఆయన సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా “బీస్ట్” మూవీ రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా మూవీగా, తమిళ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఏప్రిల్ 13న “బీస్ట్” విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలు హిట్ అయిన నేపథ్యంలో…