Vijay: మరోసారి తెలుగు అభిమానులను హర్ట్ చేసిన స్టార్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులందరూ రెండు సినిమాలు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ వారం రిలీజ్ అయ్యే మోస్ట్ అవైటెడ్ మూవీస్ కెజిఎఫ్ 2 ఒకటి కాగా దీనికి పోటీగా వస్తున్న బీస్ట్ ఒకటి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో అని ప్రతి ఒకరు ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే కెజిఎఫ్ 2 టీమ్ దేశం అంతా తిరిగి అభిమానుల అటెన్షన్ గ్రాఫ్ చేస్తుంటే కోలీవుడ్ హీరో విజయ్ మాత్రం ఒక్క ఇంటర్వ్యూ తో అటెన్షన్ రాబడుతున్నాడు. పదేళ్లు మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నాడో తెలిపి ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విజయ్.. ఈ సినిమాకు తనకు కావాల్సిన అటెన్షన్ రాట్టుకున్నాడు. అయితే తెలుగు ప్రమోషన్స్ కి అటెంట్ కానని చెప్పి తెలుగు ప్రేక్షకులను హార్ట్ చేసిన విజయ్.. మరోసారి తెలుగు అభిమానులను నిరాశ పర్చేలా మాట్లాడాడు. ప్రస్తుతం విజయ్ బీస్ట్ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్న విషయం తెల్సిందే.
దళపతి 66 గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తుండగా.. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి విజయ్ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. ‘టాలీవుడ్ లో కూడా మీకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది? అని అడిగిన ప్రశ్నకు విజయ్ సమాధానమిస్తూ “ఇది తెలుగు సినిమా కాదు.. బై లింగువల్ సినిమా .. అంతకు ముందు నా చిత్రాలు ఎలా తెలుగులో డబ్ అవుతాయో.. ఈ సినిమా కూడా అలాగే డబ్ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. దీంతో తెలుగు ప్రేక్షకుల ఆశలు ఆవిరయ్యాయి. తెలుగు డైరెక్టర్, తెలుగు ప్రొడ్యూసర్ అయ్యి ఉంది తెలుగు లో డైరెక్ట్ గా రిలీజ్ చేయకుండా డబ్బింగ్ చేయించడమేంటి..? విజయ్ కి అక్కడ ఎంత మార్కెట్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది.. మరి ఇప్పటివరకు తెలుగు స్ట్రైట్ మూవీ అంటూ తెగ గోల చేయడం ఎందుకు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా మరోసారి విజయ్.. తెలుగు అభిమానులను హార్ట్ చేశాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!