దీపావళి పండగ అంటే దీపాల వెలుగులు.. పటాకుల మోత.. ఇవి లేకుండా దీపావళి పండుగ అసంపూర్ణం.. అయితే దీపావళి పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే.. దీపావళి రోజు ఆరోగ్యంతో పాటు కంటి భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దీపావళి సందర్భంగా కాలుష్యం స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. ఆ కాలుష్యం ఇళ్లలోకి కూడా చేరి కళ్లను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో కళ్ళను రక్షించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా పటాకుల పొగ, కాలుష్యం కారణంగా కంటి చూపు కోల్పోయిన చాలా మంది ఉంటారు.
దీపావళి సందర్భంగా కళ్లలో మంట, ఎర్రబడడం, నీళ్లు కారడం వంటి సమస్యలు ఎక్కువగా నమోదవుతాయి. కంటి వైద్యుల సలహాలను పాటించడం, దీపావళి సందర్భంగా ఈ కంటి సంరక్షణ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం. దీపావళి సందర్భంగా పటాకుల వల్ల కళ్లకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. దాదాపు ప్రతి బాణసంచా నుంచి వేడి స్పార్క్‌లను విడుదల చేస్తుంది. వాటి నుండి విడుదలయ్యే పొడి కంటికి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ క్రమంలో.. దీపావళి నాడు కంటి రక్షణ కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు ఇచ్చారు.
దీపావళి సమయంలో కంటి సమస్యలు
దీపావళి సందర్భంగా భారీ సంఖ్యలో బాణసంచా కాల్చుతుంటారు. క్రాకర్ల వల్ల కళ్ళకు చాలా ప్రమాదకరం. పటాకుల్లో సీసం అనే మూలకం ఉండటం వల్ల కళ్లతో పాటు హృద్రోగులకు కూడా ప్రమాదకరం.
కంటి చికాకు ప్రమాదం
దీపావళి సందర్భంగా పటాకుల పొగతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కళ్ళకు అసౌకర్యం, పొడి కళ్ళుగా మారిపోతాయి. అలాగే.. కళ్లలో నొప్పి, ఎరుపుగా మారుతాయి. సున్నితమైన కళ్ళు లేదా డ్రై ఐ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉన్న వ్యక్తులు దీపావళి సమయంలో సరిగ్గా చూడటంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు.
అలెర్జీ కాన్జూక్టివిటిస్
దీపావళి సమయంలో దుమ్ము, వాయు కాలుష్యం వల్ల కలిగే అత్యంత సాధారణ సమస్యలలో ఇది ఒకటి. ఈ సమస్యలో కళ్ళు ఎర్రగా మారడం, దురద, కనురెప్పలు ఉబ్బడం.. చూడటంలో ఇబ్బంది ఉంటుంది.