బీసీ బిల్ ఆమోదం కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పోరాడుతోంది. సీఎం రేతంత్ రెడ్డితో సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనగణన లో కులగణన చేశాం.. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో రెండు బిల్లులు చేసి గవర్నర్ కు పంపాము.. స్థానిక సంస్థల్లో 42 శాతం…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ (BC)లకు శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీకి అదనంగా రూ.20 వేలు సబ్సిడీ రూపంలో అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా త్వరలో చట్టబద్ధత తెస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటాం అన్నారు..
బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ గండి కొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల లెక్క తెలియకపోవడం వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు నియామకాల ప్రకారం బీసీ గణన నిర్వహిస్తున్నామన్నారు. కుల గణన ఎందుకు వద్దొ నేరుగా చెప్పండని కేటీఆర్ ని ప్రశ్నించారు. జీవో18 ప్రకారం మాదిరిగానే సర్వే జరుగుతోందని తెలిపారు. బీఆర్‌ఎస్ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని మరోసారి…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసి తగిన ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం అని కనుక బీసీలు అందరు ఐక్యంగా కృషి చేసి తెలుగుదేశానికి అండగా నిలవాలని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో బీసీలు అధికంగా ఉన్నారని.. వారికి పార్టీలు తగిన ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో అధికంగా ఉండే కుర్ణి శాలివాళ్ళకి, తిరుపతిలో అధికంగా ఉండే యాదవులకు, కర్నూల్ ప్రాంతంలో కురుబ సామాజిక వర్గానికి, అనంతపూరం జిల్లాలో అధికంగా ఉండే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి తగిన ప్రాముఖ్యమైన…
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జనాభాలో 70శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ చైతన్యం కొరవడిందని గుర్తించి బీసీలను కదిలించి న్యాయం చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చిందని అన్నారు. ఏపీలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు.. ఊరుకునే ప్రసక్తి లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీలకు మరిన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీసీలు.. బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.