బీసీలకు బీజేపీ అండగా అంటుందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 1200 మంది బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పడిందని.. కేసీఆర్ కు బీసీలంటే ఎందుకంత చిన్న చూపని మండిపడ్డారు.
సీఎం వైఎస్ జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. ఏపీ సీఎంకు జీవితాంతం బీసీలు తోడుగా ఉంటారని వ్యాఖ్యానించారు మంత్రి విడదల రజిని.. గుంటూరులో జరిగిన ముదిరాజ్ మహాసభ సన్మానానికి హాజరైన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ వల్లే బీసీలకు గుర్తింపు వచ్చింది.. బీసీలకు ఇచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్లు, 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశంసలు కురిపించిన ఆమె.. ప్రభుత్వ పథకాల్లో ఎక్కువగా లబ్ధిపొందుతున్నది బీసీలే…
చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు మాత్రమే ప్రయోజనం చేసే ప్రయత్నం చేశారు.. కానీ, వైఎస్ జగన్ సర్కార్ హయాంలో పరిస్థితి మారిపోయిందన్నారు ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ 26 నెలల కాలంలో బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాస్ స్థాయి నుంచి బ్యాక్ బోన్ క్లాస్ స్థాయికి ఎదిగారని అభివర్ణించారు. ఈ రెండేళ్ల కాలంలో సుమారుగా 69 వేల కోట్ల రూపాయల ప్రయోజనం బీసీలకు చేకూరిందన్న…