R Krishnaiah: సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, చరిత్రకారుడు అంటూ ప్రశంసలు కురిపించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత పాలకులు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్‌లో విద్యను ప్రోత్సహించిన దాఖలాలు లేవు అన్నారు. ఇక, దేశం మొత్తం కులగణన జరగాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో.. సీఎం వైఎస్ జగన్.. కులాల లెక్కలు తీయాలని నిర్ణయించడం గర్వకారణం అన్నారు. దేశ వ్యాప్తంగా కులసంఘాలు అన్నీ సీఎం జగన్ ను అభినందిస్తున్నాయని తెలిపారు.. సీఎం జగన్ గొప్ప సంఘ సంస్కర్త, చరిత్రకారుడిగా అభివర్ణించిన ఆయన.. మరో 20 ఏళ్ళలో ఏపీ దేశంలోనే ప్రథమ స్ధానంలో ఉంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విదేశాల్లో చాలామంది ఏపీ నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నారని తెలిపారు.. ఇక, వైసీపీ మంత్రి వర్గంలో 11 మంది మంత్రులు బీసీలే అని.. ఏపీలో కలపాలని పక్క రాష్ట్రాల వారంటున్నారని చెప్పుకొచ్చారు. బీసీ సీఎంలు ఉన్న చోట కూడా బీసీల పరిస్ధితి బాగోలేదన్నారు. టీడీపీ పేరుకే బీసీల పార్టీ.. ఓట్ల కోసం బీసీలను వాడుకున్నారని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు జగన్ పాలన కావాలని కోరుతున్నారు అని పేర్కొన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య.
Read Also: Gorantla Butchaiah Chowdary: ఏఏజీ పొన్నవోలుపై కోర్టు ధిక్కరణ కేసుకు టీడీపీ డిమాండ్..