AP IPL Team: ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు.. చిన్నతనంగా లేదా?! ఎమ్మెస్కే ప్రసాద్ ఏం చెప్పాడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSK Prasad React on Why Andhra Do Not Have IPL Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే మరో రెండు జట్లను తీసుకొచ్చారు. దాంతో భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల నుంచి ఐపీఎల్ జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నా.. అది హైదరాబాద్ ఫ్రాంచైజీగా ముద్రపడింది. ప్రస్తుతం ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేదు. ఆంధ్రకు కూడా ఓ ప్రాంచైజీ ఉంటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఆంధ్రకు ఐపీఎల్ ప్రాంచైజీ ఎందుకు లేదో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఎమ్మెస్కే పలు విషయాలు పంచుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్ జట్లు ఉన్నా ఆంధ్రకు మాత్రం ఎందుకు లేదు?, బీసీసీఐలో కీలక రోల్ ప్లే చేసిన మీకు చిన్నతనంగా లేదా?, బీసీసీఐలో ఎవరైనా అడ్డుపడ్డారా? అని యాంకర్ అడగ్గా… ‘ఐపీఎల్, బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. సౌత్ ఇండియా నుంచి తమిళనాడుకు చెన్నై సూపర్ కింగ్స్, కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో 6-7 రాష్ట్రాలు ఉండగా.. ఒక కోల్‌కతా నైట్ రైడర్స్ మాత్రమే ఉంది. ఐపీఎల్ టీమ్ ఓ ఫ్రాంచైజీ నుంచి వస్తుంది కానీ.. ప్రాంతం తరఫున రాదు’ అని ఎమ్మెస్కే బదులిచ్చాడు.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
‘ఐపీఎల్ ప్రాంచైజీ బిడ్డింగ్ బట్టి ఉంటుంది. రెండేళ్ల కింద రెండు జట్లు అమ్మారు. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీలను అమ్మారు. అపుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్‌చంద్రా రెడ్డి 3,500 కోట్లకు బిడ్ వేశారు. 5500 కోట్లకు ఓ టీమ్, 7200 కోట్లకు మ్ముడుపోయింది. ప్రాంచైజీ కొన్నదాన్ని బట్టి ఉంటుంది కానీ.. ప్రాంతాన్ని బట్టి ఉండదు. ఓ సమయంలో వైజాగ్ లేదా అమరావతి నుంచి టీమ్ వస్తుందని అనుకున్నా.. అది జరగలేదు. టీమ్స్ ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇన్ని మ్యాచులు ఉండడం వల్లనే అంతర్జాతీయ మ్యాచులలో భారత్ ఓడిపోతుందని అంటున్నారు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు.
- Tags
- ap
- AP IPL Team
- bcci
- IPL team
- MSK Prasad
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!