వన్డే ప్రపంచకప్-2023కు భారత్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా ఈ వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ ఖారారు చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ మెగా టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఐసీసీకి పంపినట్లు తెలుస్తుంది. టీమిండియా తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆడేందుకు 8 వేదికలను బీసీసీఐ రెడీ చేసింది.
Read Also : Adipurush: ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. ఆదిపురుష్ టీమ్ క్లారిటీ
ఈ మెగా ఈవెంట్ లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే హైవోల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాక్-భారత్ మ్యాచ్ చెన్నై వేదికగా ఆక్టోబర్ 15న జరగనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ అనుకుంది.. కానీ భద్రతకారణాల దృష్ట్యా ఆఖరి నిమిషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు టాక్. అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్‌లో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపలేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
Read Also : America Shooting: అమెరికాలోని రెండు నగరాల్లో కాల్పులు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
అయితే టీమిండియా ఆడే మ్యాచ్ లను చెన్నై, ఢిల్లీ, పుణే, ధర్మశాల, లక్నో, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వేదికగా జరిగే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు మాత్రం బీసీసీఐ బ్యాడ్ న్యూస్ చెప్పిందనే చెప్పొచ్చు.. ఎందుకంటే వన్డే ప్రపంచ కప్‌కు బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఒక్కటి.. అయితే ఉప్పల్‌లో మాత్రం భారత జట్టు ఆడే సూచనలు కన్పించడం లేదు. భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు సంబంధించి బీసీసీఐ సిద్దం చేసిన డ్రాప్ట్ షెడ్యూల్‌లో ఉప్పల్ స్టేడియం పేరు లేనట్లు కనిపిస్తుంది. వేరే జట్లకు సంబంధించిన లీగ్ మ్యాచ్‌లు ఈ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది.