Is MS Dhoni Mentor for Team India in ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు భారత అభిమానులకు ఓ శుభవార్త అందే అవకాశం ఉంది.
2011 నుంచి భారత్ ఒక్క ప్రపంచకప్ టోర్నీని కూడా గెలవలేదు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ 2011ని భారత్ దక్కించుకుంది. ఆపై 2013లో ధోనీ నాయకత్వంలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పటికి 10 ఏళ్లు అవుతున్నా.. టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ టైటిల్ లేదు. 2015, 2019లో వన్డే ప్రపంచకప్‌లు.. 2012, 2014, 2016, 2021, 2022లో టీ20 ప్రపంచకప్‌లు జరిగినా భారత్ గెలవలేకపోయింది. ఇక 2019, 2023లో టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్యూటీసీ) ఫైనల్లో కూడా టీమిండియాకు నిరాశే ఎదురైంది. దాంతో ఓ ఐసీసీ ట్రోఫీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read: Ashada Bonalu 2023: నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!
ఇప్పుడు వన్డే ప్రపంచకప్ 2023 సొంతగడ్డపై జరుగనున్న నేపథ్యంలో భారత పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. అంతేకాదు ట్రోఫీ గెలిచేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదు. వన్డే ప్రపంచకప్ టార్గెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సేవలను ఉపయోగించుకోవాలి చూస్తోంది. ఈ క్రమంలోనే ధోనీకి బీసీసీఐ పెద్ద బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో ధోనీని భారత జట్టు మెంటార్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. త్వరలోనే ఈ విషయంపై ఓ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.
2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఎంఎస్ ధోనీని భారత జట్టుకు బీసీసీఐ మెంటార్‌గా నియమించింది. అతని మార్గదర్శకత్వంలో క్రీడాకారులు బాగానే ఆడారు. అందుకే మహీ అనుభవాన్ని వన్డే ప్రపంచకప్ 2023లో ఉపయోగించుకోవాలని బీసీసీఐ చూస్తోంది. ధోనీ భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు.
Also Read: Gold Price Today: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో తులం ఎంతంటే?