ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా జూన్ 7 నుంచి 11 వరకూ ఇంగ్లాండ్‌లో ని ‘ది ఓవల్’ స్టేడియం వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది.
ఛేతన్ తన ట్విటర్ అకౌంట్ లో ఇప్పటివరకూ జీవితం చాలా కష్టంగా ఉంది. మీ దగ్గరి బంధువుల నుంచి గానీ ప్రియమైన వారి నుంచి గానీ ఎటువంటి మద్దతు లేదు. మాతా రాణి నన్ను ఆశీర్వదిస్తుందని అనుకుంటున్నా..’అని రాసుకొచ్చాడు.
భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లే వచ్చి కనుమరుగైంది. తటస్థ వేదికపై టెస్ట్ సిరీస్ నిర్వహించే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ( పీసీబీ ) ప్రతిపాదనను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ( బీసీసీఐ ) కొట్టిపారేసింది. సమీప భవిష్యత్తులో కూడా భరాత్-పాకిస్తాన్ సిరీస్ జరిగే అవకాశం లేదని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత టీమ్ మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. దీంతో అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
BCCI: భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం అన్వేషణ ప్రారంభించింది బీసీసీఐ.. దీనికోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు రమేష్ పొవార్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి బదిలీ చేయబడ్డారు.. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే, టీ20 ప్రపంచకప్‌కు బ్యాటింగ్ కోచ్ హృషికేష్ కనిట్కర్ను జట్టుకు ఇంఛార్జ్‌గా నియమించారు, ఇక్కడ సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో…
రహానేను ఎంపిక చేసేముందు టీమిండియా మేనేజ్మెంట్ ధోని అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా ధోనీకి ఫోన్ చేసి రహానే ఫిట్ నెస్, ఆటతీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వెటరన్ బ్యాటర్ అజింక్య రహానె జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును ఇవాళ (ఏప్రిల్ 25) ప్రకటించారు.