రేపటి (బుధవారం) నుంచి డొమినికా వేదికగా వెస్టిండీస్ జట్టుతో భారత జట్టు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియాకు కొత్త జెర్సీ రెడీ అయింది. కొత్త జెర్సీని ధరించిన టీమ్ఇండియా ఆటగాళ్లు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే.. కొందరు క్రికెట్ అభిమానులు మాత్రం ఈ కొత్త జెర్సీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Aishwarya Rajinikanth: ఆ హీరోతో ప్రేమలో పడ్డ రజనీకాంత్ కూతురు.. మళ్ళీ పెళ్ళికి రెడీ?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యా్చ్ కు అప్పటి స్పాన్సర్ అడిడాస్ తయారు చేసిన జెర్సీతో భారత జట్టు ఆడింది. దీంతో ఆ జెర్సీకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. జెర్సీ ముందు భాగంలో దేశం పేరు రాసి ఉండటంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ కు అది బాగా నచ్చింది. అయితే.. తాజాగా అడిడాస్ స్థానంలో వచ్చిన స్పాన్సర్ డ్రీమ్ 11 దాని పేరును జెర్సీ ముందు భాగంలో రాసి ఉంది. ఈ నెల ప్రారంభంలో జట్టు కొత్త జెర్సీ హక్కులను డ్రీమ్ 11 పొందింది.
అయితే.. కొత్త జెర్సీలు ధరించిన ఆటగాళ్ల ఫోటోలు వైరల్ కావడంతో.. ఈ ఇష్యూపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ని తిట్టుకుంటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టెస్టు మ్యాచ్ లు అంటే పూర్తిగా వైట్ కలర్‌లో ఉండాల్సిన జెర్సీలు క్రమంగా రంగుల మయంగా మారుతుందని.. వన్డేల్లో ధరించే జెర్సీల్లా తయారు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం పేరు ఉండాల్సిన స్థానంలో డ్రీమ్ 11 పేరు ఉండడం చూస్తుంటే దేశం కోసం క్రికెట్ ఆడుతున్నట్లుగా లేదని.. కేవలం డ్రీమ్ 11 కోసం ఆడుతున్నట్లు ఉందని పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Himanshu : గొప్ప మనసు చాటుకున్న కేసీఆర్ మనవడు.. రూ. కోటితో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేసిన హిమన్షు
టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కొత్త సైకిల్( 2023-2025) ప్రయాణాన్ని ప్రారంభింస్తుంది. వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ తో ఇది స్టార్ట్ కానుంది. గత రెండు టోర్నమెంట్స్ లోనూ భారత జట్టు ఫైనల్‌కు చేరినప్పటికీ ఫస్ట్ టైం న్యూజిలాండ్, సెకండ్ టైం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ ఈ సారి కూడా ఫైనల్ చేరుకుని కప్ కొట్టాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. సీనియర్ ఆటగాళ్లు లేని విండీస్ జట్టుపై విజయాలు సాధించి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.