Rohan Jaitley as BCCI Secretary: ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడం లాంఛనమే. 16 మంది సభ్యులలో 15 మంది షాకు మద్దతుగా ఉన్నారు. అయితే షా ఎప్పుడు నామినేషన్ దాఖలు చేస్తాడన్నది ఇంకా తెలియరాలేదు. నామినేషన్ వేయడానికి నేడే (ఆగష్టు 27) ఆఖరు తేదీ. మరికొన్ని గంటల్లో విషయం తెలిసిపోనుంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎన్నికైన…
Shikhar Dhawan: టీమిండియా స్టార్ బాట్స్మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నేడు ఈ విషయాన్ని తన X ఖాతా ద్వారా వీడియో రూపంలో తెలిపాడు. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భావోద్వేగానికి గురి అయ్యాడు. భారతదేశం కోసం ఆడటం తన కల నిజమైందని, ఇప్పుడు తాను ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని., తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్ లకు, బీసీసీఐకి, డీడీసీఏకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…
టీ20 ప్రపంచకప్ 2024 ముందు బార్బడోస్‌లో భారత జెండాను ఎగురవేస్తాం అని అభిమానులకు బీసీసీఐ కార్యదర్శి జై షా మాట ఇచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. తన మాట నిజమైనట్లు బుధవారం ముంబైలో జరిగిన వార్షిక సియట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో జై షా గుర్తు చేశారు. మరో రెండు లక్ష్యాలు టీమిండియా ముందు ఉన్నాయని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో విజయం భారత్…
BCCI secretary Jay Shah Eye on ICC Chairman Post: ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం వచ్చే నవంబరు 30తో ముగుస్తుంది. మూడోసారి ఛైర్మన్ ఎన్నికల బరిలో నిలవకూడదని అతడు నిర్ణయించుకున్నారు. దాంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే జై షా పోటీ చేస్తాడా? లేదా అన్నది ఆగష్టు 27న తెలుస్తుంది. ఎందుకంటే ఐసీసీ…
గాయాల కారణంగా ఆటకు దూరమై.. మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోసారి ఇదే విషయంపై ఆయన స్పష్టత ఇచ్చారు. భారత క్రికెటర్లు తమ ఫిట్నెస్, ఫామ్‌ను నిరూపించుకోవాలంటే.. డొమిస్టిక్ అత్యుత్తమ వేదిక అని జై షా పేర్కొన్నారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి వారికి మాత్రమే కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా రవీంద్ర…
MS Dhoni CSK Team: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం కోసం ప్లేయర్ రిటెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. కొన్ని నివేదికల ప్రకారం, అభ్యర్థన మేరకు బోర్డు అలా నిర్ణయించింది. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ పాత నిబంధనను మళ్లీ అమలు చేయనున్నారు. ఇది ఫ్రాంచైజీకి మాజీ భారత కెప్టెన్ MS ధోనిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇందుకు సంబంధించి…
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది.
Team India Schedule: జూన్ నెలలో టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత జట్టు జింబాబ్వే, శ్రీలంకలో పర్యటించింది. ఇప్పుడు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్టు, టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఆగస్టు 7న చివరి వన్డే ఆడింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో తదుపరి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా భారత జట్టుకు 42 రోజుల విరామం లభించింది. అయితే., బంగ్లాదేశ్ సిరీస్ నుంచే అసలు విషయం మొదలవుతుంది.…
బీసీసీఐ గొప్ప మనసు చాటుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత.. నేపాల్ క్రికెట్ జట్టుకు భారత్‌లో సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కాగా.. బీసీసీఐ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌ను భారతదేశంలో తన మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతించింది. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనేందుకు నేపాల్ జట్టుకు బీసీసీఐ అనుమతినిచ్చింది.