ఇటీవలి కాలంలో సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు సిరీస్‌లను ఆడింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులను, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులను ఆడింది. బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్‌పై మాత్రం ఘోర పరాజయంను చవిచూసింది. ఈ ఐదు టెస్టులు జరిగిన పిచ్ రిపోర్ట్‌లను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఇందులో ఒక్క పిచ్‌కు మాత్రమే మంచి రేటింగ్ వచ్చిందట. మిగతా నాలుగు పిచ్‌లు మాత్రం పాస్ అయినట్లు తెలుస్తోంది.
Also Read: Venu Swamy-Notice: వేణుస్వామికి మరోసారి నోటీసులు పంపిన మహిళా కమిషన్!
వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట కోల్పోయిన కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. కాన్పూర్ ఔట్‌ఫీల్డ్‌పై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం సిద్ధం కావడానికి చాలా సమయం పట్టడం దానికి కారణమని తెలుస్తోంది. పిచ్ విషయంలో మాత్రం ఐసీసీ సంతృప్తికరంగానే ఉంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు జరిగిన చెపాక్ స్టేడియం పిచ్ చాలా బాగుందని ఐసీసీ తెలిపింది. బెంగళూరు, పుణె, ముంబై వేదికల్లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు జరిగాయి. ఈ పిచ్‌లపై ఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్, గ్వాలియర్, ఢిల్లీ వేదికలుగా టీ20 మ్యాచ్‌లు జరగగా.. అన్ని పిచ్‌లు బాగున్నాయని ఐసీసీ రేటింగ్ ఇచ్చింది.