IND vs AUS: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్ నవంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఈనెల 22న పెర్త్ లో స్టార్ట్ కానుంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్స్ ఆస్ట్రేలియాకు చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్టు సిరీస్ భారత్ జట్టుకు ఎంతో కీలకం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులను టీమిండియా గెలవాల్సి ఉంది. దీంతో ఈ సిరీస్ ను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Read Also: Koti Deepotsavam 2024: కార్తీక ఆదివారం వేళ.. కోటి దీపోత్సవంలో 9వ రోజు కార్యక్రమాలు ఇవే!
కాగా, ప్రతిష్టాక టోర్నీ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. మొదటి టెస్టు ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ కు కూడా గాయపడ్డాడు. శనివారం జట్టులోని ఆటగాళ్లతో అంతర్గత మ్యాచ్ ఆడుతుండగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ వేలికి గాయమైంది. అతని వేలుకు బంతి బలంగా తాకడంతో .. వెంటనే మ్యాచ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత స్కానింగ్ తీయగా గిల్ వేలికి చీలిక వచ్చినట్లు వైద్యులు తెలిపారు. తొలి టెస్టుకు మరో ఐదు రోజులే సమయం ఉండటంతో.. ఆలోపు అతడు కోలుకునే ఛాన్స్ తక్కువగా ఉందని బీసీసీఐ చెప్పుకొచ్చింది.
Read Also: Success Story: రూ.8 లక్షలతో స్టార్టప్.. ప్రస్తుతం రూ.23,567 కోట్ల బిజినెస్.. విజయ రహస్యం?
ఇక, కేఎల్ రాహుల్ మోచేతికి దెబ్బ తాకడంతో శుక్రవారం రాహుల్ గ్రౌండ్ ను వీడాడు. అయితే, తొలి టెస్టు ప్రారంభానికి మరో ఐదు రోజులు సమయం ఉండటంతో అతడు మ్యాచ్ సమయానికి జట్టుకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. గిల్ గాయం మానాలంటే కనీసం వారం రోజులకు పైగా సమయం పడుతుందని సమాచారం. శుభ్ మన్ గిల్ తొలి టెస్టుకు దూరమైతే.. అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.