భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ట్రోఫీ కాంట్రవర్సరీ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప.. సమస్యకు పులిస్టాప్ పడడం లేదు. అటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఇటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తగ్గేదేలే అంటుండడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీనే. నఖ్వీ నాటకాల కారణంగా ఫైనల్ ముగిసి దాదాపు…
ఆసియా కప్ 2025 ట్రోఫీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఫైనల్ ముగిసి 20 రోజలు దాటినా.. ట్రోఫీ, మెడల్స్ ఛాంపియన్ భారత జట్టు చేతికి రాలేదు. ఇందుకు ప్రధాన కారణం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ. తాజాగా భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) నుంచి హెచ్చరిక ఇ-మెయిల్ వెళ్లినా.. నఖ్వీ తగ్గేదేలే అంటున్నాడు. ఆసియా కప్ 2025 ట్రోఫీని తన చేతుల మీదుగానే టీమిండియాకు ఇస్తా అని…
ఇటీవలే దాయాది పాకిస్థాన్‌ను ఓడించిన భారత జట్టు ఆసియా కప్ 2025ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. దాంతో ఫైనల్ రోజు నఖ్వీ ట్రోఫీతో దుబాయ్‌లోని ఒక హోటల్‌కు వెళ్ళాడు. పాకిస్తాన్‌కు బయలుదేరే ముందు ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు ఇవ్వడానికి నిరాకరించాడు. కెప్టెన్ సూర్యకుమార్…
సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌కు వెళ్లేది లేదని, హైబ్రిడ్ మోడల్‌లో అయితే టోర్నీ ఆడుతామని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్‌లో మొత్తం టోర్నీ నిర్వహిస్తామని, హైబ్రిడ్ మోడల్‌కు తాము అస్సలు ఒప్పుకోమని పీసీబీ పేర్కొంది. మొండిపట్టు మీదున్న పాకిస్థాన్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకుంటే.. టోర్నీ మొత్తాన్ని షిఫ్ట్ అవుతుందని పీసీబీకి ఐసీసీ చెప్పింది. దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్‌కు తాము సిద్దమే అని…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసిన పీసీబీ.. ఐసీసీకి పంపింది. బీసీసీఐ కారణంగా కారణంగా ఐసీసీ ఇంకా షెడ్యూల్‌ను రిలీజ్ చేయని విషయం తెలిసిందే. అయితే హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పీసీబీ అంగీకరించకపోతే.. టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల…
India won’t travel to Pakistan for Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందజేసింది. అయితే ఈ షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత జట్టు పాకిస్థాన్‌లో ఆడదని…