ఏపీలో స్తబ్ధుగా ఉన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎన్.రఘువీరా రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. సమాజంలో కులాల తీసివేత సాధ్యం కాదన్నారు. యాబై ఏళ్ల క్రితం బీపీ మండల్ బీసీ జనగణన చేయాలని రిపోర్ట్ ఇస్తే ఇప్పటి వరకు అమలు జరగలేదు. కేంద్రం తక్షణం బీసీల జన గణన జరపాలన్నారు. బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలి. చట్ట సభలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ లు రావాలన్నారు రఘువీరారెడ్డి. జనాభా ప్రాతిపదికన 52 శాతం విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ లు ఇవ్వాలి.
Read Also: Nayanthara: భర్తను అవమానిస్తే నయన్ ఊరుకుంటుందా.. అందుకే ఆ పని..?
బీసీ ల కుల జన గణన జరగాలి. బీహార్, రాజస్తాన్ ప్రభుత్వాలు బీసీ జనగణన చేస్తున్నారు..మన రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే బీసీ జనగణన చేయబోతుందన్నారు. బీపీ మండల్ సిఫారసులు అమలయ్యే వరకు పార్టీల కు అతీతంగా నాయకులు అందరూ పోరాటం చేయాలన్నారు. మంత్రులతో బీసీ నాయకుల అజెండా సాధనా ప్రమాణం చేయించారు మాజీ మంత్రి రఘువీరా రెడ్డి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు బీసీల జనగణన గురించి కేంద్రంపై పోరాటం చేస్తున్నాయి.
Read Also: Buddha Venkanna: మంత్రి అమర్నాథ్ ఆస్తులపై విచారణ జరగాలి