T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్-2024 కోసం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నిన్న (మే 31న) న్యూయార్క్ వెళ్లి అక్కడ ఉన్న టీమిండియా శిబిరంలో జాయిన్ అయ్యాడు. ఐదు రోజులు ఆలస్యంగా టీమ్ తో కలిశాడు. దీంతో ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న విరాట్.. ఇవాళ (శనివారం) భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న ఏకైక వార్మప్ మ్యాచ్‌లో ఆడడం అనుమానంగా ఉంది. సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత అతడు రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Read Also: Project Z : ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న సందీప్ కిషన్ మూవీ …
కాగా, నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 స్టార్ట్ కానుంది. ఆతిథ్య దేశం అమెరికా, కెనడా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. అయితే, ఈసారి టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ కలిసి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 20 జట్లు ఈ టైటిల్ కోసం పోటిపడుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మే 28వ తేదీన న్యూయార్క్ చేరుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ను భారత్ ఆడబోతుంది.
Read Also: BRS Candle Rally: నేడు బీఆర్‌ఎస్ క్యాండిల్ ర్యాలీ.. గన్ పార్క్ నుంచి సచివాలయం వరకు
ఇక, బంగ్లాదేశ్‌తో ఇవాళ జరగనున్న వార్మప్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు శుక్రవారం ప్రాక్టీస్ చేశారు. రింకూ సింగ్, శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్ ఆప్షనల్ సెషన్‌లో కూడా భాగం పంచుకున్నారు. దీంతో వార్మప్ మ్యాచ్ తుది జట్టులో ఎవరెవరు ఆడబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. టీమ్ లో విరాట్ కోహ్లీ పాత్రతో పాటు ఫస్ట్-ఛాయిస్ వికెట్ కీపర్‌పై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడంతో ఎవరికి చోటిస్తారనేది పెద్ద టాస్క్ గా మారింది.