Bangladesh Temple: బంగ్లాదేశ్‌లో ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చిన కాళీ దేవి కిరీటం చోరీ..
- బంగ్లాదేశ్ లో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జెషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీ..
- చోరికి గురైన భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చిన బంగారు కిరీటం..
- ఈ బంగారు కిరీటం కోసం గాలిస్తున్న బంగ్లాదేశ్ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Temple: బంగ్లాదేశ్ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాల ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాపూజ సందర్భంగా బంగ్లాలో 4 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే, మరోవైపు బంగ్లాదేశ్‌లోని సత్‌ఖిరా నగరంలోని శ్యామ్‌నగర్‌లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని బంగారు కిరీటం అపహరణకు గురైంది. ఈ ఘటన ఆలయంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అందులో ఓ యువకుడు బంగారు కిరీటం తీసుకెళ్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి.
Read Also: UBIT Coin Case: యూబిట్ కాయిన్ కేసు పై ఈడీ నజర్.. నిర్మల్ పోలీసులకు లేఖ..
Also Read
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
- Bill Gates: ఏఐతో బిలియన్ మంది ప్రాణాలు పోయే ప్రమాదం! బిల్ గేట్స్ తీవ్ర హెచ్చరిక
- Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
కాగా, బంగ్లాదేశ్‌లోని ఈ కాళీ ఆలయ కిరీటంతో ప్రధాని మోడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. 2021లో ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతేకాదు, ఆలయంలోని కాళీమాతకు బంగారు కిరీటాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇప్పుడు ఆ కిరీటం దుర్గాపూజ ప్రత్యేక సందర్భంలో దొంగతనం చేశారు.
ఇక, ఈ ఆలయంలో దొంగతనం జరిగిన సంఘటన అక్టోబర్ 10వ తేదీ మధ్యాహ్నం 2:50 గంటల మధ్య చోటు చేసుకుంది. ఆలయ పూజారి దిలీప్ కుమార్ బెనర్జీ రోజువారీ పూజను పూర్తి చేసిన తర్వాత దేవాలయానికి తాళాలు దాని నిర్వహణ బాధ్యత రేఖ సర్కార్‌కు అప్పగించారు. అయితే, ఇతర పనుల్లో నిమగ్నమైన రేఖ సర్కార్.. తిరిగి వచ్చి చూసే వరకు కాళీ మాతకు ధరించిన బంగారు కిరీటం కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు కొనసాగిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఫకర్ తైజుర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఇచ్చిన బహుమతి దొంగిలించారని.. దానిని కనుగొనడానికి ట్రై చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించడానికి సీసీటీవి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!