భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ వేదికగా శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అందుకోసం.. టీమిండియా ప్లేయర్స్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. అక్కడి నుంచి నోవాటెల్, తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాధర స్వాగతం పలికారు. ఎల్లుండి దసరా పండగ, ఉప్పల్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరుగనుండడంతో క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నిండనున్నది.
Read Also: CV Anand: ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించిన సీపీ..
కాగా.. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా.. టిమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచింది. సిరీస్ ను భారత్ 2-0తో సొంతం చేసుకోగా.. ఉప్పల్ లో నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఏదేమైనాప్పటికీ.. చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. రేపు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి.
Read Also: Hizb-ut-Tahrir: దేశభద్రతలకు ముప్పు.. ‘‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’’ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్రం..