Donald Trump: హిందువులతో పాటు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని భారతీయ అమెరికన్లు కోరుతున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వచ్చే ఏడాది ఏర్పాటు కాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని, యూఎస్ కాంగ్రెస్‌ని సంప్రదించడానికి భారతీయ అమెరికన్లు కృషి చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌పై ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో హిందువులపై జరిగిన దాడుల్ని ఖండించారు. దీపావళి సందర్భంగా అక్కడ భారతీయ కమ్యూనిటీ సమావేశానికి హాజరైన ట్రంప్ బంగ్లాదేశ్ తీరును ఎండగట్టారు. హిందువులపై జరుగుతున్న హింసకు సంబంధించి బంగ్లాదేశ్‌కి వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తారనే భారతీయ అమెరికన్ డాక్టర్ భరత్ బరాయ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హిందువులపై దాడులు విషయంలో పరిస్థితి మెరుగుపడకుంటే ఆర్థిక ఆంక్షలను పరిశీలించే ధైర్యమున్న వ్యక్తి ట్రంప్ అని ఆయన అన్నారు.
Read Also: Meenakshi: సుశాంత్ తో పెళ్లి.. ఓపెనయిపోయిన మీనాక్షి
‘‘ వారి వ్యాపారంలో 80 శాతం వాటా కలిగిన వస్త్ర ఎగుమతులు నిలిచిపోతే, బంగ్లాదేశ్ ప్రజలు ఏం తింటారు..? మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కేవలం సైన్యంచే నియంత్రించబడుతోంది. అతను కేవలం కీలు బొమ్మ. దేశాన్ని నియంత్రించేది సైన్యమే’’ అని బరాయ్ అన్నారు.
అంతకుముందు దీపావళి వేడుకలకు హాజరైన ట్రంప్ మాట్లాడుతూ..కమలా, జోబైడెన్‌లు ఇద్దరూ ప్రపంచ వ్యాప్తంగా, అమెరికాలోని హిందువులను విస్మరించారని, వారు ఇజ్రాయిల్ నుంచి ఉక్రెయిన్ వరకు ఇబ్బందులు కలిగించారని, మేము అమెరికాను బలపరుస్తామని, శాంతిని తిరిగి తీసుకువస్తామని చెప్పారు. “బంగ్లాదేశ్‌లో మొత్తం గందరగోళ స్థితిలో ఉన్న హిందువులు, క్రైస్తవులు మరియు ఇతర మైనారిటీలపై దాడి మరియు దోపిడీకి గురౌతున్న అనాగరిక హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ట్రంప్ అన్నారు. రాడికల్ లెఫ్ట్, మత వ్యతిరేక ఎజెండా నుంచి మేము హిందూ అమెరికన్లను రక్షిస్తామని, మీ స్వేచ్ఛ కోసం పోరాడుతామని ట్రంప్ చెప్పారు.