Bangladesh: నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు.. సాయంత్రం నుంచే ఫలితాలు
- నేడు బంగ్లాదేశ్ ఎన్నికలు
- ఉ.7:30 నుంచి సా.4:30 వరకు ఓటింగ్
- సాయంత్రం నుంచే ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ సంక్షోభం, హింస, హిందువుల హత్య తర్వాత గురువారం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7:30 గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేయనున్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. 5 లక్షల మంది సిబ్బంది పేపర్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. గురువారం రాత్రికి ఫలితాలు వెలువడనున్నాయి.
మొత్తం 300 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. అభ్యర్థి మరణంతో ఒక స్థానంలో పోలింగ్ నిలిపివేశారు. మిగతా 299 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1 మిలియన్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ఇది కూడా చదవండి: Off The Record: గులాబీని గట్టిగా కొడితేనే తెలంగాణలో కమల వికాసమా..?
తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ఎన్నికల్లో ముందస్తు ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు దాని మిత్రపక్షం, షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఇ-ఇస్లామి(జేఐఐ) వెనుకంజలో ఉంది. రాజకీయ విశ్లేషకుడు డేనియల్ రెహమాన్ ప్రకారం బీఎన్‌పీ విజయం సాధించవచ్చని అంచనా వేశాడు. ఆగస్టు 2024లో విద్యార్థుల నేతృత్వంలో చెలరేగిన హింస కారణంగా 15 ఏళ్ల హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఇక 17 ఏళ్ల తర్వాత తారిక్ రెహమన్ లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చాడు.
ఇక ఈసారి ప్రతి ఓటరు 2 ఓట్లు వేయనున్నారు. ఒకటి ఎన్నికల కోసం కాగా.. ఇంకొకటి రాజ్యాంగం మార్పు కోసం ఓటు వేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం తెల్ల బ్యాలెట్ పత్రాలు ఉండగా.. రాజ్యాంగ సవరణ కోసం గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!