తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజాసంగ్రాయ యాత్ర 5వ విడత పాదయాత్ర ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన లింబ (బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బైంసాలో బహిరంగ సభను విజయవంతం చేసుకున్నామని, ఆ సభకు ప్రజలు ఏ సంఖ్యలో తరలివచ్చారో మీరు చూశారన్నారు. కాలాలకతీతంగా సంవత్సరకాలంగా పాదయాత్ర చేస్తున్నామని, ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేదోళ్ల రాజ్యం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్లు బయటికి వస్తారు. లింబ(బి) గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చాయి? కేసీఆర్ సర్కార్ ముంపు గ్రామ ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదు. వాళ్లకు కొద్దోగొప్పో కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పట్టుకుంటే పడిపోయేటట్టు ఉన్నాయి.
Also Read : Top Headlines- @ 1 PM: టాప్ న్యూస్
సొంత జాగా ఉన్న వాళ్లకి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి… ఇప్పుడు మూడు లక్షల రూపాయలంటూ మాట తప్పిండు కేసీఆర్. అబద్ధం ఆడే వాడే కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కేసీఆర్ అంటే… ఖాసీం చంద్రశేఖర్ రజ్వి. తెలంగాణలో రజాకారుల పాలనను కేసీఆర్ చూపిస్తున్నాడు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ… జైళ్ళలో పెట్టిస్తున్నాడు. తాగుడు పండుడు తప్ప, కేసీఆర్ చేసేది ఏమీ లేదు. బీజేపీ కార్యకర్తలు పెట్టే టెన్షన్ కు… ప్రస్తుతం కేసీఆఆర్ ఫుల్ బాటిల్ ఎత్తుతుండు. ఈ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయా? నీళ్లు ఇవ్వలేదు… రోడ్లు వేయలేదు… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు… ఉద్యోగాలు లేవు ఏక్ నిరంజన్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 79 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడా? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు.
Also Read : Balayya: నేను చిరు కలిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది
5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు రాష్ట్రాన్ని అప్పులకుప్పజేసి, ప్రజలకు చిప్ప చేతికిచ్చిండు. పుట్టబోయే బిడ్డ నెత్తిపై కూడా లక్ష రూపాయలు అప్పు పెట్టిండు. కేసీఆర్ పాలనలో పెళ్లి చేసుకుందామన్న భయపడే పరిస్థితిలు ఉన్నాయి. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఏర్పడితేనే… మీకు న్యాయం జరుగుతుంది. ఓబీసీల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం. నిన్న బాసర త్రిబుల్ ఐటీలో 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులను పొమ్మనలేక పొగ పెడుతున్నారు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కేసీఆర్ బంధువే పాయిజన్ అయిన విద్యార్థులను కనీసం హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లనీయడం లేదు. అక్కడ నిర్బంధం విధించి, విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాడు. అన్ని స్కామ్లలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారిమల్లిస్తున్నాడు. మోడీ ఆదేశాలతోనే నేను పాదయాత్ర చేస్తున్న. ప్రజల కోసమే నా పాదయాత్ర. లోన్లు కట్టని కేసీఆర్ కు, నేడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి?. పెద్దోడి రాజ్యం పోవాలి… పేదోళ్ల రాజ్యం రావాలి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణలో అభివృద్ధి చేసి చూపిస్తాం’ అంటూ బండి సంజయ్ ప్రసంగించారు.