Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి రాగానే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతోపాటు రైతు బీమాను కూడా అందజేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. పంట నష్టపరిహారంతోపాటు రైతు బీమా అందని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాల 5వ రోజు జోరుగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో.. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం, కుంటాల మండలం అంబకంటి గ్రామంలోని పాదయాత్ర రాత్రి శిబిరం వద్ద బండి సంజయ్ ని కలిసిన అంబకంటి తండాకు చెందిన మహిళా వితంతు రైతు శ్యాముకాబాయి తన గోడు వెళ్ళబోసుకున్నారు. తన భర్త(రాథోడ్ రవీందర్) ఈ ఏడాది జూలై 25న మరణించాడని బండి సంజయ్ కి చెప్పిన శ్యాముకా బాయ్ తనకు 2 ఎకరాల పట్టా భూమి ఉన్నప్పటికీ ‘రైతు బంధు’ రావడం లేదని వాపోయారు. పట్టా భూమి కలిగి ఉన్నప్పటికీ ఆన్లైన్లో మాత్రం మా భూమిని చూపించడం లేదని వాపోయారు.
Read also: Mumbai: 8వ తరగతి విద్యార్థినిపై తోటి స్టూడెంట్స్ సామూహిక అత్యాచారం
దీంతో తన భర్త చనిపోయి 5 నెలలు గడిచినా ఇంతవరకు ‘రైతు బీమా’ కూడా అందలేదన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినప్పటికీ పరిహారం కూడా అందలేదన్నారు. అదికారులు, ఎమ్మెల్యే చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ‘రైతుబంధు’, ‘రైతు బీమా’ వచ్చేలా… మీరే చూడాలని ప్రాథేయపడ్డారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ ‘‘మీరేం బాధపకండి.. మీకు అండగా మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. మీ తరపున బీజేపీ పోరాడుతుంది. మీకు రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం’ అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’’అంటూ భరోసా ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోవతే… రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని… తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా రైతు బీమా, రైతు బంధు, పంట నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Top Headlines- @ 1 PM: టాప్ న్యూస్