కేసీఆర్ పాలనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. శనివారం ఆయన ప్రజసంగ్రామ యాత్ర పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలోని దిల్వార్‌పూర్ మండలానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 1400 మంది అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని, కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. ఇక్కడ కేసీఆర్ షాపులు ఎన్ని ఉన్నాయి? అని, ఊర్లో గుడి, బడి లేకపోయినా… బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయన్నారు. కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో లిక్కర్, క్యాసినో లో పెట్టుబడులు పెట్టిందని ఆయన ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయలేదని, దళిత బంధు లేదు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లేదు.. మహిళలకు రుణాలు ఇవ్వలేదు.. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదు.. రోడ్లు లేవు.. చదువుకుందామంటే కాలేజీలు లేవు…. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు.. కేసీఆర్ ను అభివృద్ధి చేయమంటే పైసలు లేవంటున్నాడు. వేలకోట్లు దండుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయి అని ఆయన విమర్శించారు. లిక్కర్ దందా, డ్రగ్స్, స్యాండ్ ఇలా అన్నీ దందాలు కేసీఆర్‌వే అని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు కూడా కేసీఆర్ పైసలు ఇవ్వడం లేదని, తెలంగాణకు మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేస్తే… కేసీఆర్ ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టించాడు? అని ఆయన ప్రశ్నించారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక, కనీసం పెళ్లికి పిల్లనివ్వని పరిస్థితి నెలకొంది. రైతులను బికారీలుగా మార్చిండు. వరి వేస్తే ఉరే అంటాడు.
Also Read : NPCI: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం , ఫ్రీచార్జ్ వాడుతున్నారా? అయితే మీకు ఊరట..
సన్న వడ్లు, దొడ్డు వడ్లు అంటూ రైతులను ఆగం చేసిండు. సన్నవడ్లు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు ఈ ఎనిమిదేళ్లలో ఒక్క పైసా కూడా పంట నష్టం కింద పరిహారం ఇవ్వలేదు. రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే… రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది. ధాన్యం సేకరణలో నిధులను మంజూరు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే. ఒక్క రైతు బంధు పేరు చెప్పి, రైతులకు రావలసిన అన్నింటిని బంద్ చేసిండు.
అన్నదాతలకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఒక్క ఎకరానికి సబ్సిడీపై 30 వేల రూపాయలు ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే. ‘కిసాన్ రైతు సమ్మాన్ నిధి’ కింద ఎకరానికి రైతుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుకు చేర్చిండు. పుట్టబోయే బిడ్డ పేరుపై కూడా లక్ష రూపాయల అప్పు పెట్టిండు బీసీల కులవృత్తులను నాశనం చేసిండు. ఎస్టీలకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదు. నేను చెప్పే లెక్కలు తప్పయితే… నన్ను ఏమైనా చేయండి. దిల్వార్ పూర్ మండలానికి కేంద్రం నుంచి భారీగా నిధులను మంజూరు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనే… ప్రజల కోసం కొట్లాడితే… నన్ను కూడా 3 రోజులు జైలుకు పంపిండు..
మీకోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నా.. తిండి, నిద్ర లేకున్నా…. మీకోసమే తిరుగుతున్న.. కేసీఆర్ పాలనలో పేదోళ్లు చచ్చిపోతున్నారు.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా… అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. 37 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.. 12 మంది స్వర్ణకారులు ఆకలితో ఆత్మహత్య చేసుకున్నారు.. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన బిడ్డ కవితను కాపాడుకునేందుకే… కేసీఆర్ మహిళ అనే సెంటిమెంటును రగిలిస్తున్నాడు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు.. పేదోల్లు కొట్లాడితే వచ్చిన తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు.. మహారాష్ట్రలో ఒక్క సంవత్సరంలో… లక్ష ఇండ్లు కట్టించి, దసరా రోజే లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిన ఘనత బీజేపీది అని బండి సంజయ్ ప్రసంగించారు.